Nadendla Manohar : రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలకు ఇవాళ ఒక పండుగ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బియ్యం, కందిపప్పు ప్రత్యేక కౌంటరు సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజారులో ప్రత్యేక కౌంటరు ఏర్పాటు చేశారు. మచిలీపట్నం లోని రైతుబజారులో కందిపప్పు, బియ్యం స్టాల్ ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. బియ్యం, కందిపప్పు సబ్సిడీ ధరలకు రైతు బజారులో అందుబాటులో ఉంచనుంది ప్రభుత్వం. నిత్యావసర సరకులను రాయితీపై అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకుంది. రైతుబజార్లలో రాయితీపై బియ్యం, కందిపప్పు పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కందిపప్పును కేజీ 160, సోనామసూరి బియ్యాన్ని కిలో 49కు రాయితీ పై అందించనుంది ప్రభుత్వం. ఈ సందర్భంగా ఏపీ సివిల్ సప్లై శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలకు ఇవాళ ఒక పండుగ అని ఆయన వ్యాఖ్యానించారు. సంక్షేమ పధకాలతో పాటుగా నిత్యవసర సరుకులు సరైన ధరలకి అందించడానికి కృషి చేసామన్నారు. ధాన్యం కొనుగోలులో అన్యాయం జరుగుతున్న దానిపైన పోరాటాలు చేసామన్నారు నాదెండ్ల మనోహర్.
Also Read
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
- Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
- Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
రైతులకు చెల్లించాల్సిన 600 కోట్లు కూడా త్వరలో చెల్లిస్తామన్నారు మంత్రి నాదెండ్ల. ధరల స్ధిరీకరణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్యంగా రీటైలర్స్ తో సమీక్షించామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. 284 ఔట్ లెట్లు లో ఇవాళ కందిపప్పు, బియ్యం అందిస్తున్నామన్నారు. రోజుకు 391 మెట్రిక్ టన్నులు బియ్యం, 125 క్వింటాళ్ళ కందిపప్పు అందుబాటులో ఉంచామని ఆయన అన్నారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సామాన్యులకు అందించడంలో పొరపాటు రాకుండా దాడులు చేస్తున్నామని ఆయన అన్నారు. డిమార్టు, ఉషోదయ, రిలయన్స్ లాంటి మార్టులలో కూడా రీటైల్ గా అందుబాటులో ఉంచుతామన్నారు. కాకినాడలోనే 43249 మెట్రిక్ టన్నులు పిడిఎస్ బియ్యం సీజ్ చేసామన్నారు. నాకున్న సమాచారం ప్రకారం పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపు లో నలుగురు ఐపీఎస్ లు ఉన్నారన్నారు.
తాజావార్తలు
-
Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
-
YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
-
Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
ట్రెండింగ్
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?