రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించకుండా పంట రుణమాఫీని అమలు చేయాలని, అలాగే గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు . అసెంబ్లీకి బయలుదేరే ముందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , సీనియర్ నేతలు హరీష్‌రావు , జగదీష్ రెడ్డి తదితరులతో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్‌పార్క్ వద్ద సమావేశమై తెలంగాణ అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి…
కేంద్రబడ్జెట్లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. ఏపీ వెనుకబడిన జిల్లాల గురించి మాట్లాడారని, తెలంగాణలో వెనుకబడిన జిల్లాలు లేవా అంటూ ప్రశ్నించారు.
టీడీపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. బడ్జెట్లో ఏపీ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించారని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టారని.. ఎన్నో పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపెట్టారన్నారు.
ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. జూరాల జలాశయం నుంచి లక్షా 75 వేల క్యూసెక్కులకు పైగా వరద నీటిని దిగువకు విడుదల చేశారు. మంగళవారం మధ్యాహ్నం నాటికి 1,50,900 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది.
టీటీడీ లెటర్స్పై మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు మాదిరి సమానంగా చూడాలని ఎమ్మెల్సీలు లక్ష్మణ రావు, రవీంద్ర, వేంకటేశ్వర రావు కరారు. ఇప్పటి వరకు నాలుగు రోజులు లెటర్‌కు 6 మందికి దర్శనం అనుమతి ఇచ్చారని ఎమ్మెల్సీలు పేర్కొన్నారు.
గ్రూపు 1 పరీక్ష అక్రమాల పై గత ప్రభుత్వ తీరును ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తప్పు బట్టారు. గ్రూపు-1 పోస్టుల భర్తీ నియామక పరీక్షపై అసెంబ్లీలో ప్రశ్నించారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ధూళిపాళ్ల డిమాండ్ చేశారు. సభ్యుల సూచనల మేరకు సీబీఐ విచారణను పరిశీలిస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరారు. ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఢిల్లీలో ఏపీలో జరుగుతున్న హింసాకాండకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేయనున్నారు.