కేంద్ర బడ్జెట్‌పై సీఎ రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శించడం కాదు కక్షపూరితంగా వ్యవహరించడంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తూన్నారన్నారు. 18 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి, ఇతర మంత్రులను ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరచిన పార్లమెంటు ఆమోదించి హక్కులను కల్పించిన విషయంతో పాటు ఈ పది సంవత్సరాలలో గత ప్రభుత్వం తో జరిగిన నష్టం నుండి క్పడటానికి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులను విడుద…
ఇది దేశ హిత బడ్జెట్ అని, మోడీ విజనరీకి అద్దం పట్టేలా ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బండి సంజయ్ స్పందిస్తూ.. నాగలికి రెండు ఎడ్ల మాదిరిగా అభివ్రుద్ది, సంక్షేమం సమపాళ్లలో ఉండేలా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం గొప్ప బడ్జెట్ ను రూపొందించింది. భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకగా ఉంది. 2047 నాటికి ఆర్దిక ప్రగతిలో భారత్ ను నెంబర్ వన్ గా చూడాలనే…
విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.3 కోట్లు వసూలు చేశారు దంపతుల జంట. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా ఉరాన్లో చోటు చేసుకుంది. ఓ సంస్థను కలిగి ఉన్న దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విదేశాల్లో చదువు, ఉద్యోగం ఇప్పిస్తానని ఓ డాక్టర్‌తో పాటు అతని కుటుంబసభ్యులను రూ.3 కోట్లకు పైగా మోసం చేశారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి.
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల స్థాయిలో మంచి వాతావరణం తెస్తామని, మూడోతరగతి వరకు అదే గ్రామంలో పాఠశాల ఉంటుందన్నారు భట్టి విక్రమార్క. అంగన్ వాడి అయాలతోపాటు విద్యాబోధన కోసం ప్రత్యేక టీచర్లు అని, ప్రతి పది గ్రామాలకు ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి మండలానికి మూడు సమీకృత రెసిడెన్సిల్…
సీఎం అసెంబ్లీలో మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష గొంతు వింటే ఎందుకు భయపడుతున్నారని ఆయన అన్నారు. తప్పించుకునేందుకే నాలుగు రోజులు అసెంబ్లీ రన్ చేస్తారని, డిమాండ్స్ పై మూడు రోజులు మాత్రమే డిస్క్యుషన్ పెట్టారన్నారు. 31 లోపు అప్రప్రేషన్ బిల్లు కావాలంటే బడ్జెట్ ముందు పెట్టాలని తెలీదా? అని ఆయన ప్రశ్నించారు. బీఅర్ఎస్ మాదిరిగానే మూడు నాలుగు రోజులు బడ్జెట్…
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆటోమొబైల్ రంగంలో కస్టమ్స్ సుంకం నుండి పూర్తి మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పరిశ్రమతో సహా అనేక రంగాలకు లిథియం కీలకమైన భాగం. అంతేకాకుండా.. రాగి, కోబాల్ట్.. అరుదైన భూమి మూలకాలపై కూడా మినహాయింపు ప్రతిపాదించారు. ఇంకా.. ఈ మెటీరియల్‌లలో బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD)ని తగ్గించాలని ఆర్థికమంత్రి సూచించారు. ఆర్థిక మంత్రి చేసిన ఈ ప్రకటనతో…
లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ తెలంగాణను పూర్తిగా విస్మరించారని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బడ్జెట్ రాజకీయ ప్రేరేపితమైందని, ప్రజల కోసం కాదని, బీజేపీ మిత్రపక్షాలు, జేడీయూ, టీడీపీలను ప్రసన్నం చేసుకునేందుకే బడ్జెట్‌ను రూపొందించారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీహార్‌కు రూ.41,000 కోట్ల ఆర్థిక సాయం అందించగా, ఆంధ్రప్రదేశ్‌కు రూ.15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు సహా…
సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడు సంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్‌గా గుర్తించారు పోలీసులు. అతను విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో సమస్యలతో డిప్రెషన్లో ఉరేసుకొని ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో తాత్కాలిక పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని హెచ్చరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అత్యవసర పరిస్థితుల్లో ఏ సమయంలోనైనా తనను సంప్రదించాలని అధికారులను కోరారు. రాబోయే మూడు రోజులలో 30-40 కి.మీ/గం గాలులతో పాటు వర్షం కురిసే అవకాశం ఉంది. జూలై 22, సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో నిర్వహించిన…
రోహన్ బోపన్న తన కెరీర్లో 35 ఏళ్ల తర్వాత భారీ విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం బోపన్న వయసు 44 ఏళ్లు. అయినప్పటికీ.. అతను విజయాల్లో దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం బోపన్న.. మాథ్యూ ఎబ్డెన్తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుని గ్రాండ్‌స్లామ్ గెలిచిన ఎక్కువ వయస్సున్న టెన్నిస్ ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడు బోపన్న కళ్లు పారిస్ ఒలింపిక్స్‌పై పడ్డాయి. అయితే.. తాను తన రెగ్యులర్ భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్తో కాకుండా ఎన్. శ్రీరామ్ బాలాజీతో రంగంలోకి దిగబోతున్నాడు.