Peddavagu Project: పెద్దవాగు ప్రాజెక్టుకు తక్షణ సాయంగా రూ.3.50 కోట్లు మంజూరు
- పెద్దవాగు ప్రాజెక్టుకు తక్షణ సాయంగా రూ3.50 కోట్లు మంజూరు
- ప్రాజెక్టు కట్ట మరమ్మతులు ప్రారంభం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddavagu Project: ఇటీవల వర్షాలతో వరద పోటెత్తడంతో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి ప్రాజెక్టు పెద్ద వాగుకు 250 మీటర్ల పొడవున గండిపడిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 18.6 అడుగులు దాటడం, మూడు క్రస్ట్‌గేట్లలో ఒకటి పనిచేయకపోవడంతో ఇటీవల గండిపడి భారీ నష్టం జరిగింది. పెద్దవాగు ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో రైతులు పండిస్తున్న పంటలకు ఈ సీజన్‌లోనే సాగునీరు అందించేలా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. బండ్ ఫార్మేషన్, అప్రోచ్ కాలువ పనులకు రూ.3.5 కోట్లతో అధికారులు అంచనాలను తయారు చేయగా.. అశ్వారావుపేట పెద్దవాగు ప్రాజెక్టుకు తక్షణ సాయంగా రూ3.50కోట్ల రూపాయలను చేసిన రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రాజెక్టు కట్ట మరమ్మతులకు కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు. ఈ ఏడాది ఆయకట్టు రైతులకు సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ, ఏపీ పరిధిలో 16 వేల ఎకరాల ఆయుకట్టు కలిగిన పెదవాగు ప్రాజెక్టుకు తక్షణ మరమ్మతులు చేసి ఈ సీజన్‌లోనే రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు తగిన ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.
Read Also: CS Shanti Kumari: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
Also Read
ఇటీవల పెద్దవాగుకు గండితో దిగువన తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి, కోయరంగాపురం, కొత్తూరు, రమణక్కపేట గ్రామాలకు పాక్షికంగా నష్టం జరగ్గా, ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, కోయమాదారం, కొత్తపూచిరాల, పాతపూచిరాల, అల్లూరినగర్, సొందిగొల్లగూడెం, వసంతవాడ, గుళ్లవాయి, వేలేరుపాడు గ్రామాలకు భారీగా నష్టం సంభవించింది. తెలంగాణలో 4 గ్రామాలు, ఏపీలో 16 గ్రామాలు.. మొత్తం 20 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. దాదాపు 2000 కుటుంబాలు ఎవరి దారిన వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. భారీగా ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. వందల సంఖ్యలో పశువులు, గొర్రెలు మేకలు కొట్టుకు పోయాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు, ట్రాన్స్ ఫార్మర్లు నేల కొరిగి వరదలో కలిసి పోయాయి. ఎన్నో ఆశలతో సాగుచేసిన పొలాల్లో ఇసుక మేటలు వేసి అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
తాజావార్తలు
-
US Iran Sanctions: ఇరాన్‌తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
-
Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!