తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ బైలా ప్రకారం ప్రస్తుత అధ్యక్షులు దిల్‌రాజు పదవి కాలం ముగిసింది. ఆ పదవికి ఈసారి అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. ఈ సారి పిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవిని పంపిణీ రంగం నుంచి ఇచ్చారు. గతేడాది సినీ నిర్మాత అయిన దిల్ రాజుకు అవకాశం ఇచ్చారు. దిల్ రాజు పదవీ కాలం ముగియడంతో ఎన్నికలు నిర్వహించారు. ఏడాదికోసారి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు…
చంద్రబాబు శ్వేతపత్రాలు, జగన్ ప్రకటనలతో ప్రజలు అయోమయంలో ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఏ రంగంలో దేశ అభివృద్ధి జరిగిందో సీనియర్ నాయకుడు చంద్రబాబు చెప్పాలని అన్నారు.
ఢిల్లీలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదనీరు రాత్రి రౌస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి చేరింది.. దీంత… ముగ్గురు విద్యార్థులు నీటమునిగి మృతి చెందారు. మృతి చెందిన ముగ్గురు విద్యార్థుల్లో మంచిర్యాలకు చెందిన విద్యార్థిని సోని ఒకరు. శ్రీరామ్‌పూర్-1 భూగర్భగని మేనేజర్‌గా పనిచేస్తున్నారు సోని తండ్రి విజయ్ కుమార్. ఏడాది క్రితం ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో సోనీ కోచింగ్ సెంటర్లో చేరింది. తమ కుమార్తెను కాలేజీలో చేర్పించేందుకు నాగ్‌పూర్‌లో ఉన్న ఆమె తల్లిదండ్రులు సోని మృతదేహాన్ని మళ్లీ…
ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది టీమిండియా. భారత్ బ్యాటింగ్‌లో స్మృతి మంధాన (60) హాఫ్ సెంచరీతో అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. మంధాన ఇన్నింగ్స్ లో 47 బంతుల్లో 60 రన్స్ చేయగా.. అందులో 10 ఫోర్లు ఉన్నాయి. దీంతో.. శ్రీలంక ముందు 166 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఏపీలో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగుల్చాయి. మరోవైపు.. లంక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అల్లూరు జిల్లాలో వర్షాల జోరు తగ్గలేదు. దీంతో.. వాగులు, వంకలు ఉధృతంగా ఉప్పోంగుతున్నాయి. ముంచంగిపుట్టు మండల పరిధిలో భారీ వర్షాలకు లక్ష్మీపురం పంచాయితీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటి పారుదల అధికారులతో సమీక్ష నిర్వహించామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక బడ్జెట్లో నీటిపారుదల రంగం మీద స్పష్టత వచ్చిందన్నారు. 10,820 కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కేటాయించిందని, ఎక్కడ పనులు అగాయో.. ఎవరికి పెమేంట్ ఇవ్వాలి అనేది సమీక్షలో చర్చ జరిగిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాన కాలంలో కొన్ని చోట్ల వరద వచ్చే అవకాశం ఉందని, నీటిపారుదల సంబంధించి…
కాసేపట్లో భారత్-శ్రీలంక మధ్య ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంకలోని దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
నంద్యాల జిల్లా వాసి బ్యాంకాక్‌లో కిడ్నాప్ అయిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగానికి బెంగుళూరు నుంచి బ్యాంకాక్ వెళ్తున్నట్టు కిడ్నాప్ అయిన మధుకుమార్ కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లాడు.
బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చిన డ్రగ్స్ మీద విచారణ జరిపించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో ప్రస్తావించి ఎంక్వైరీ కోసం డిమాండ్ చేయాలని కోరారు. గుజరాత్, మహారాష్ట్రకు మాత్రమే ఇప్పటి వరకు డ్రగ్స్ దిగుమతుల ఆనవాళ్లు ఉన్నాయని.. రాజకీయ కోణంలో కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోణంలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌కు అభినందనలు తెలుపుతూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.