KTR : రూ.40 వేల కోట్ల రుణాలు ఉన్నాయని చెప్పి మాఫీ చేసిందెంత.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రుణమాఫీ అంతా బోగస్ అని తేలిపోయిందని, స్వతంత్ర భారతదేశంలో నే ఇది అతి పెద్ద మోసమన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకే సంతకంతో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అన్నారని, రైతులను రేవంత్ రెడ్డి అడ్డంగా మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు ప్రతి రైతు కు రుణమాఫీ చేస్తాము అన్నారని, రేషన్ కార్డు కావాలని చెప్పలేదన్నారు కేటీఆర్. వెంటనే వెళ్లి రెండు లక్షలు తెచ్చుకోండి అన్నారని, నలభై వేల కోట్లు అన్నారు కానీ చాలా కటింగ్ లు పెట్టారన్నారు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ అని నిరూపించారని, ఎన్నికల ముందు చెప్పని కొర్రీలు ఇప్పుడు పెడుతున్నారన్నారు. పంద్రాగస్టు వరకు రుణమాఫీ అన్నారు కదా అని మేము కూడా వెయిట్ చేశామని, కానీ ఇప్పుడు అంతా మోసం అని అర్థం అయ్యిందని ఆయన మండిపడ్డారు. రుణమాఫీ నలభై శాతం మాత్రమే అయిందని, నిన్నటి వరకు 17 934 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. brs ప్రభుత్వం మొదటి దఫా లో 35 లక్షల మందికి 17 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని, మేము ఉన్నప్పుడు రుణమాఫీ చేశాము, రైతు బంధు ఇచ్చామన్నారు కేటీఆర్.
Devara Part – 1 : భైరా గాడి దెబ్బకు జనాలు అబ్బా.. సైఫ్ అదరకొట్టాడు బాసూ!
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
అంతేకాకుండా..’కానీ ఇప్పుడు ఇవ్వాల్సిన రైతు భరోసా ఇంకా ఇవ్వలేదు. రైతుల ను నమ్మించి తడి గుడ్డ తో గొంతు కోశారు. చారనా కోడి కి బారానా మసాలా అనే విధంగా ప్రభుత్వ తీరు ఉంది. కొండల్ రెడ్డి పర్యటన విజయవంతం అయింది.. రేవంత్ రెడ్డి పర్యటన ఫెయిల్ అయింది అని.. ఆయన ఫ్రస్టేషన్ లో ఉన్నారు.బక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణ లో ఉంది అని సీఎం అంటున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో అయినా.. ఏ ఊరిలో అయినా పూర్తిగా రుణమాఫీ అయింది అని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను. సీఎం కు దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించండి. ఏ ఊరిలో అయినా 100 శాతం రుణమాఫీ అయింది అని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మళ్లీ మీడియా ముందుకు కూడా రాను. పంద్రాగస్టు లోపల రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తాను అన్నారు. పూర్తిగా రుణమాఫీ చేయకుండానే హరీష్ రావు ను విమర్శిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మానసిక పరిస్థితి పై నాకు అనుమానం ఉంది. పాలన చెత్తగా ఉంది అని ప్రజలు చెబుతున్నారు.
Demonte Colony 2: వణికి పోవడానికి రెడీ అవ్వండి.. “డిమాంటీ కాలనీ 2” వచ్చేస్తోంది!
రేవంత్ రెడ్డి 19 వ సారి ఢిల్లీ కి వెళ్ళాడు. కేసీఆర్ పదేళ్ల లో కూడా 19 సార్లు ఢిల్లీ కి పోలేదు. ఈయన 8 నెలల్లో 19 సార్లు ఢిల్లీ వెళ్ళాడు. రేపటి నుంచి కార్యాచరణ ప్రకటిస్తాం.. ఊరు ఊరు తిరుగుతాం. నిన్న నేను మాట్లాడిన మాటలకు మహిళల కు క్షమాపణ చెప్పాను. సెప్టెంబర్ లో మేము వేరే రాష్ట్రాలకు పోతాము. అక్కడ ఉన్న పార్టీల పరిస్థితులు అధ్యయనం చేస్తాము. ఆ తర్వాత కొత్త కమిటీ లు వేస్తాము. టీడీపీ, ysrcp నుంచి కూడా కావాలంటే నేర్చుకుంటాం. టీడీపీ 40 ఏళ్లుగా, వైసీపీ 15 ఏళ్లుగా ఉన్నాయి. ఆంద్రప్రదేశ్ కు వెళ్ళము. మాకు రాజీనామాలు కొత్తకాదు.. రేవంత్ రెడ్డి కి మాట తప్పడం కొత్త కాదు. తెలంగాణ లో ఎన్నికలు రాబోతున్నాయి.. మేము సిద్ధంగా ఉన్నాము’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!