“సిందూర్” తర్వాత తొలి విదేశీ పర్యటన.. మూడు దేశాలకు వెళ్తున్న ప్రధాని మోడీ.. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. వచ్చే వారం కెనడాలో జరగబోయే జీ-7 సదస్సుకు ప్రధాని హాజరు కానున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా మోడీకి ఫోన్ చేసి ఆహ్వానించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా-భారత్ మధ్య…
భవనం పైకప్పుపై దొరికిన బ్లాక్ బాక్స్.. అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాద ఘటనకు కారణాలు తెలుసుకునేందుకు కీలకమైన ‘‘బ్లాక్ బాక్స్’’ దొరికింది. విమానం కూలిపోతున్న సమయంలో సమీపంలోని డాక్టర్స్ హాస్టల్స్ భవనాన్ని ఢీకొట్టింది. ఇప్పుడు అదే బిల్డింగ్ పైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. దీంతో, 265 మందిని బలి తీసుకున్న ఈ ఘోర దుర్ఘటనకు కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) పూర్తిస్థాయిలో పని ప్రారంభించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లో సాంకేతికలోపం.. చివరికీ.. భారత వైమానిక దళానికి చెందిన M17 అపాచీ హెలికాప్టర్ శుక్రవారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో జరిగిన నష్టంపై అధికారిక సమాచారం అందలేదు. వాస్తవానికి.. పఠాన్‌కోట్ వైమానిక దళ కేంద్రం నుంచి బయలుదేరిన హెలికాప్టర్, సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నట్లు సమాచారం అందడంతో ముందుజాగ్రత్తగా బహిరంగ ప్రదేశంలో ల్యాండ్ అయింది. హెలికాప్టర్ దిగుతున్నట్లు చూసిన…
ముగిసిన నీటిపారుదల శాఖ ఏఈ శ్రీధర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. 200 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు కరీంనగర్‌కు చెందిన నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) శ్రీధర్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం తెల్లవారుజామున భారీగా దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శ్రీధర్‌పై నమోదైన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు, పెద్దఎత్తున అక్రమ ఆస్తులు వెలుగులోకి తీసుకొచ్చారు. కరీంనగర్, సిద్ధిపేట్, వరంగల్, హైదరాబాద్ సహా…
హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం.. మెగా స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో, యంగ్ హీరో నిఖిల్ హీరోగా ‘ది ఇండియా హౌస్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పాన్ ఇండియన్ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే బుధవారం ఈ సినిమా షూటింగ్లో ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ సమీపంలో నిర్మించిన సెట్లో ఈ ఘటన సంభవించింది. అయితే సినిమాలోని కీలకమైన సముద్రం సన్నివేశాలు…
లాస్ ఏంజిల్‌లో ఉధృతం అవుతున్న ఆందోళనలు.. భారీగా బలగాలు మోహరింపు అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అయితే ట్రంప్ వలస వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ లాస్ ఏంజిల్‌లో పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. అయితే బలగాలు అడ్డుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. ఇక ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. దీంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. దీంతో నేషనల్ గార్డ్స్ మోహరించాలని…
నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్‌కి ముహూర్తం ఫిక్స్.. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘తమ్ముడు’. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇందులో ‘కాంతారా’ ఫేమ్ సప్తమి గౌడ కథానాయికగా నటించగా .. లయ, వర్షా బొల్లమ్మ, స్వాసిక, బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్దేవ్ కీలక పాత్ర పోషించారు. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ…
ఏలూరు: నేడు పోలవరం ప్రాజెక్టకు మంత్రి నిమ్మల రామానాయుడు. ఉదయం 9 గంటలకు డయాఫ్రంవాల్ నిర్మాణ పనుల పరిశీలన. అనంతరం ఇంజనీరింగ్ అధికారులు, ఏజేన్సీలతో మంత్రి సమీక్ష. నేడు ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో తీవ్ర ఎండలు ఉండే ఛాన్స్. నేడు ఏపీ వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ మహిళా విభాగం పిలుపు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా ప్రదర్శనలు.…
రెండు కుటుంబాలను ఆగం చేసిన వివాహేతర సంబంధం మెదక్ జిల్లాలో వివాహేతర సంబంధం కారణంగా రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. హావేలి ఘనపూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన నరేష్ (31), సునీత (28) మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇద్దరికీ కుటుంబాలు ఉన్నప్పటికీ, వారి సంబంధం తీవ్రతరమైంది. నరేష్‌కు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉండగా, సునీతకూ భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ వ్యవహారం గ్రామంలో తెలిసిపోయింది. పెద్దలు పంచాయతీ…
జ్యోతి మల్హోత్రాకు బెయిల్..? నేడు కోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది..! పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేశారనే ఆరోపణలతో సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు ఈరోజు (జూన్ 9న) తొలిసారి కోర్టులో విచారణకు రాబోతుంది. ఆమెను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరు చేయడం జరుగుతుంది. అయితే, గత విచారణలో, హిసార్ కోర్టు జ్యోతి మల్హోత్రాను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె హిసార్ సెంట్రల్ జైలులోనే…