గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరంగల్ మహబూబాబాద్ రూట్ లో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. మూడు చోట్ల సుమారు వెయ్యి మంది సిబ్బందితో ట్రాక్ మరమ్మతు పనులను చేపడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే జీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్ష బీభత్సానికి రైల్వే వ్యవస్థ అతలాకుతలమైంది. రైల్వే ట్రాక్‌లు పలుచోట్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. జోన్ పరిధిలో 101 రైళ్లు పూర్తిగా, మరో 8 పాక్షికంగా రద్దయ్యాయి. 68 రైళ్లను దారి…
కృష్ణమ్మ ఉధృతితో కొట్టుకొస్తున్న బోట్లు.. విజయవాడ రైల్వే బ్యారేజీకి 3 అడుగుల దూరంలో వరద నీరు విజయవాడలోని కృష్ణా నదికి భారీగా వరద నీరు వస్తుంది. దీంతో విజయవాడలోని రైల్వే బ్యారేజ్ కి మూడు అడుగుల దూరంలో ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుంది. వరద ప్రవాహం పెరిగితే రైల్వే ట్రాక్ పైకి నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్, కనకదుర్గమ్మ వారధి మీదుగా, ప్రవహిస్తున్న లక్షల క్యూసెక్కుల నీరు.. ప్రకాశం బ్యారేజీ దిగువకు విడుదల…
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 90శాతానికి చేరుకుంది. మరి కొన్ని గంటలలో ప్రాజెక్టు వరద గేట్లుఎత్తి గోదావరి నదిలోకి వదిలి అవకాశం ఉంది. కావున గోదావరి నదీ పరిసర ప్రాంతాలలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలెనని ముఖ్యంగా రైతులు చేపలు పట్టేవారు పశువుల కాపరులు నదిలోకి దిగవద్దని విజ్ఞప్తి చేశారు ఇంజనీర్ ఇరిగేషన్ సర్కిల్ పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సూపరింటెండింగ్.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ పరివాహక ప్రాంతాల…
నేడు జరగాల్సిన JNTU పరీక్షలు వాయిదా. 5వ తేదీకి వాయిదా వేసిన JNTU. నేడు ఉస్మానియా పరిధిలోని కాలేజీలకు సెలవు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం. నేడు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు. ప్రకాశం బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద. 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటి విడుదల. ఇన్‌ఫ్టో 11,20,101 క్యూసెక్కులు. కెనాల్స్‌కు 500 క్యూసెక్కుల నీటి విడుదల. ఏపీకి ఆరు NDRF బృందాలు పంపనున్న కేంద్రం. 40 పవర్ బోట్లు…
తెలంగాణలో భారీవర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వరదలతో వాటిల్లిన నష్టాన్ని అమిత్‌షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అమిత్ షా కు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైన తక్షణ సాయం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం…
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో సెప్టెంబర్ 2న జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో, సెప్టెంబర్ 3 నుండి పరీక్షలు టైమ్ టేబుల్ ప్రకారం నిర్వహించబడతాయని తెలిపారు. వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్‌ను నిర్ణీత సమయంలో తెలియజేస్తాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే.. భారీ వర్షాల సూచన…
ఆంధ్రప్రదేశ్ లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో.. కృష్ణా నది వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో.. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ప్రభావిత ప్రాంత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
పేర్ని నాని కారుపై కోడిగుడ్లతో దాడి.. గుడివాడలో ఉద్రిక్తత..! గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. మాజీ మంత్రి పేర్ని నాని కారు పైన కోడిగుడ్లతో దాడి జరిగింది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు కాచి మరి పేర్ని నాని కాన్వాయ్‌ను అడ్డుకుని కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. తమ అధినేతపై పేర్ని నాని చేసిన…
శని, ఆదివారాల్లో కురుస్తున్న వర్షాలకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాల కంటే సిద్దిపేట జిల్లాలో ఎక్కువ వర్షం కురిసింది. ఆదివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య సిద్దిపేటలోని మిరుదొడ్డి మండలంలో 152.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ కాలంలో సిద్దిపేటలోని 12 మండలాల్లో 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాగా, మెదక్‌లోని రెండు మండలాల్లో 100…