విజయవాడ సింగ్‌నగర్ లో కొందరు వ్యాపారులు, ప్రైవేటు మోటార్ బోట్ నిర్వాహకులు చేతివాటం చూపిస్తున్నారు.. వాంబే కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ, రాజరాజేశ్వరిపేట, పైపుల కాలనీ, వైఎస్ఆర్ కాలనీ ప్రాంతాల నుంచి బోట్ల సాయంతో సింగ్ నగర్ కు వచ్చే బాధితుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. మరోవైపు కొందరు వ్యాపారులు కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాలను సేకరించి శివారు కాలనీలకు తీసుకువెళ్ళి భారీ మొత్తలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.. ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నా అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో అందిన కాడికి వారు సొమ్ము చేసుకుంటున్నారు.. దగ్గరి ప్రాంతాలకు కూడా మూడు రోజులుగా ఆహార పదార్థాలు పంపిణీ చేయలేదని బాధితుల ఆందోళన చెందుతున్నారు.. ఆహార పదార్థాలు బ్లాక్ లో కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు లేక మూడు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
R Ashwin: ఎంఎస్ ధోనీ కంటే అతడే తెలివైన కెప్టెన్: అశ్విన్