దక్షిణ మధ్య రైల్వేలో భారీగా రైళ్లను రద్దు చేసింది. దీంతో సౌత్ సెంట్రల్ రైల్వే రైల్వే రవాణా వ్యవస్థ స్థంభించింది. ఒకే సారి 80కి పైగా రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. భారీ వర్షాలతో రైల్వే ట్రాక్ ల మీదకు వరద నీరు చేరుకుంది. రైల్వే ఉన్నతాధికారులు రైల్వే నిలయం డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూం నుంచి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. వరద ఉధృతికి కేసముద్రం, విజయవాడ రాయంపాడు ట్రాక్ ల మీద నుంచి వరద…
ఆగస్టు నెలకు సంబధించి జీఎస్టీ వసూళ్ల వివరాలను ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 2024లో మొత్తం GST వసూళ్లు రూ. 1.75 లక్షల కోట్లు వచ్చినట్లు తెలిపింది. వార్షిక ప్రాతిపదికన జీఎస్టీ వసూళ్లు 10 శాతం పెరిగాయి. గత ఏడాది ఆగస్టులో వస్తు, సేవల పన్ను (GST) ఆదాయం రూ. 1.59 లక్షల కోట్లు కాగా.. ఈ ఏడాది ఆగస్టులో రూ. 1.75 లక్షల కోట్లు వసూలు చేసింది.
మహబూబాబాద్ జిల్లాలో విషాదం మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి తండ్రి కూతురు నీట మునిగి చనిపోయారు. ఆదివారం ఉదయం మరిపెడ (మ) పురుషోత్తమాయగూడెం దగ్గర ఉన్న బ్రిడ్జి పై నుండి వరదనీరు.. ప్రవహిస్తున్న ప్రవాహాన్ని అంచనా వేయకుండా వెళ్లిన కారు కొట్టుకొని పోయి ఇద్దరు మృతి చెందారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన నూనావత్ మోతిలాల్, నూనావత్ అశ్వినిగా గుర్తింపు. కారులో తండ్రీకూతురు ఇద్దరూ హైదరాబాద్ విమనాశ్రయానికి బయలుదేరారు.…
గతేడాది ఓ మహిళ తనను తాను పెళ్లి చేసుకున్న ఘటన ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా.. ఇప్పుడు విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, మోడల్. ఆమె పేరు సులనే కారీ. ఈ 36 ఏళ్ల మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే.. ఈమె 'సోలోగామి' తనను తాను పెళ్లి చేసుకోవడం ద్వారా ఇంటర్నెట్ వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. బ్రెజిల్‌కు చెందిన సులనే కారీ.. ప్రస్తుతం లండన్‌లో నివసిస్తుంది.
వాతావరణ శాఖ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రెడ్ అలార్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా అన్ని వేళల అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్ తో ఆదివారం జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు సర్ ప్లస్ అవుతున్న నేపథ్యంలో లోతట్టు…
హైదరాబాద్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి భార్యాభర్తలు ఆత్మహత్య.. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారంలోని ఓ అపార్ట్మెంట్లో ఇద్దరు పిల్లలను చంపి.. భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు మంచిర్యాలకు చెందిన వెంకటేష్ (40), వర్షిణి (33)గా గుర్తించారు. వీరికి రిషికాంత్ (11), విహంత్ (3) పిల్లలు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆన్ లైన్ బెట్టింగ్ వ్యాపారం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ…
Mobile phone explode: మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సమయంలో ఫోన్ మాట్లాడటం కానీ, దానిని వాడటం కానీ ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కూడా మనం ఆ హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూనే ఉంటాం. ఫలితంగా మొబైల్ ఫోన్లు పేలి ప్రమాదాలకు గురవుతున్నాం. తాజాగా మధ్యప్రదేశ్‌లో 9 ఏళ్ల చిన్నారి చేతిలో మొబైల్ ఫఓన్ పేలింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.
భారత వైమానిక దళ వైస్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ (వాయు భవన్)లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం.. నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించారు.
భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాల కు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు ల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు కుంటల్లో నీటిని నిల్వ చేయాలని సూచించారు. ఎగువన కురిసిన వర్షాలతో పాటు కడెం నుంచి వస్తున్న వరద తో పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండింది. ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీటిని గోదావరి లోకి వదులుతున్నారు.…
పారాలింపిక్స్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన పారాలింపిక్స్ మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (SH1) ఈవెంట్లో భారత షూటర్ అవనీ లేఖరా, సిద్ధార్థ్ బాబు ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. అవనీ 11వ స్థానంలో నిలవగా, సిద్ధార్థ్ బాబు 28వ స్థానంలో నిలిచాడు.