గుంటూరు జిల్లా లోని ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండల పరిధి గ్రామాల్లో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు పదివేల ఎకరాల్లో వరి నీట మునిగిందని అధికారులు గుర్తించారు. పొన్నూరు ఏ.డి.ఎ రామకోటేశ్వరి తో పాటు మండల వ్యవసాయ శాఖఅధికారిని కె కిరణ్మయి నీటి ముంపుకు గురైన ప్రత్తి పంట పొలాలను పరిశీలించారు. ఈ కార్యమంలో లాం శాస్త్రవేత్తలు యం.నగేష్, ఎస్. ప్రతిభ శ్రీ, వి. మనోజ్ , డి. ఆర్ సి ఇన్చార్జి డి డి ఎ సునీత ఏ ఓ రాజవంశీ , ఆయా గ్రామాల రైతులు లు పాల్గొన్నారు. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ప్రత్తి పంట పొలంలో నీటిని తీసివేసి అంతర కృషి చేసి పొలం ఆరేలా చూడాలని మెగ్నీషియం సల్ఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని , 90 రోజుల లోపు వయసు వున్న పొలంలో బూస్టర్ డోస్ గా 30 కిలోల యూరియాం 10 కిలోల పొటాష్ ఒక ఎకరాకు వేసుకోవాలి.
3500 Year Old Jar: 3500 ఏళ్ల నాటి కూజాను పగలగొట్టినా.. మ్యూజియంకు మళ్లీ ఆహ్యానించారు!
మండల వ్యవసాయాధికారి మాట్లాడుతూ సుమారుగా 10000 ఎకరాలు వరి పొలాలు నీటిలో మునిగి వున్నాయని అయితే శాస్త్రవేత్తల అంచనా ప్రకారం వరి మొక్క 4నుండి 5 రోజులు నీటిలో ఉన్నప్పటికీ నష్టము వాటిల్లదు అని పొలంలో నీటిని తీసివేసి 30 కిలోల యూరియాం 15 కిలోల MOP అదనం గా వేసుకోవాలి. BLB వచ్చే అవకాశం ఉంది కనుక పొటాష్ తప్పనిసరిగా వేసుకోవాలి. నేరుగా విత్తిన వరిలో నెల రోజుల లోపు వున్న పంటలో మొక్కలు చనిపోయినట్లయితే అక్కడ ఒత్తుగా వున్నచోట మొక్కలు పీకి నాటుకోవాలి. లేదా నారు తెచ్చుకొని నాటుకోవాలని రైతులకు సూచించారు. పొన్నూరు ఎ డి ఎ , కాకుమను ఎ ఓ, తహసీల్దార్ బి. వి. వెంకట స్వామిని కలిసి పరిస్థితి వివరించారు. నల్లమడ డ్రైనేజీ జే ఇ శివ ప్రస్తుతం నల్లమడ లోకి పొలాలు నుండి నీరు వెళ్తున్నది అని తహశీల్దార్ కి తెలిపారు.
IC 814: The Kandahar Hijack: నెట్‌ఫ్లిక్స్ “IC 814 హైజాక్” సిరీస్ బ్యాన్ చేయాలని హైకోర్టులో పిల్..