ఏపీలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. అయితే.. విజయవాడలో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఈ నేపథ్యంలో రెండు రోజులు విజయవాడలోనే సీఎం చంద్రబాబు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కొందరు అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. మానవత్వంతో వ్యవహరించడం లేదంటూ చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా కొందరు అధికారులు కావాలనే వ్యవహరిస్తున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇకపై చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. బాధితులకు అన్ని రకాలుగా సాయం అందిస్తున్నామని, లోతట్టు ప్రాంతాల్లో ఉండే చివరి వ్యక్తికి సాయం అందాలన్నారు సీఎం చంద్రబాబు. ఏ విధంగానైనా సాయం చేయాలని స్పష్టం చేశానని, ఫుడ్ డెలివరీ కోసం ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేశామన్నారు. వార్డు సచివాలయాల పరిధికే ఫుడ్ సరఫరా చేపడతామని, ఇళ్లల్లోకి పాములు, తేళ్లుూర వస్తున్నాయన్నారు సీఎం చంద్రబాబు.
Minister Ponnam Prabhakar: హిమాయత్ సాగర్ జలాశయాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్…
అంతేకాకుండా..’అధికార, పోలీసు యంత్రాంగం సరైన రీతిలో వ్యవహరించాలి. ప్రజలు బాధతో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా అధికారులు వ్యవహరించాలి. తప్పు జరిగితే సహించను.. కఠిన చర్యలు ఉంటాయి. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సమాచారం రప్పించుకుంటున్నాం. ప్రజలూ సంయమనం పాటించాలి.బాధితులకు ప్రతి ఒక్కరు సహకరించాలి. శక్తి మేరకు బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఈ పరిస్థితుల్లో రాజకీయం చేయడం తగదు. ఐదేళ్లు వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారు. జక్కంపూడిలో నిర్సక్ష్యంగా వ్యవహరించిన ఓ అధికారిని సస్పెండ్ చేశాను. మంత్రులైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారి మీద చర్యలు ఉంటాయి. కొందరు అధికారులని వరద సహయక చర్యలకు పంపితే.. సరిగా పని చేయకుండా తేడాగా వ్యవహరించారు. ఇలాంటి అధికారులను ఊపేక్షించను. జీతం తీసుకుని ప్రజల కోసం పని చేయరా..? అధికారులకు బాధ్యత లేదా..? కూటమి అధికారంలోకి వచ్చాక కూడా అధికారులేంటీ ఇలా పని చేస్తున్నారని కొందరు నన్నే అడుగుతున్నారు. మృతదేహం ఉంటే చూసీ చూడనట్టు వెళ్లిపోతారా..? కొందరు అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. వరదతో ప్రజలు ఇబ్బందులు పడుతోంటే.. రాజకీయం చేస్తారా..?’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
IC 814 The Kandahar Hijack: IC 814 హైజాక్ సిరీస్‌లో రెండు తప్పులు: రియల్ పైలట్ కెప్టెన్ దేవీ శరణ్..