రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు సెలవులు పెట్టొద్దన్నారు. స్థానిక పరిస్థితుల మేరకు రేపు స్కూల్స్ కు సెలవులు ప్రకటించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఖమ్మంలో నాకు కావాల్సిన ఓ ముస్లిం కుటుంబం వరదల్లో చిక్కుకుందని, వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి.…
దేశంలో వర్షాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ(IMD) కొత్త నివేదికను విడుదల చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సెప్టెంబర్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నివేదిక ప్రకారం.. ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో.. అక్కడ వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిపింది.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు నేపద్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి నది తీరం వెంబడి అధికారులు 24/7 అప్రమత్తంగా ఉండాలన్నారు. *రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు గురించి ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా…
జబల్పూర్ నుంచి హర్యానా వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో.. ఫ్లైట్‌ను నాగ్‌పూర్‌కు దారి మళ్లించారు. బాంబు బెదిరింపు వచ్చిన విమానం.. ఇండిగో 6ఈ 7308గా గుర్తించారు. విమానాన్ని నాగ్‌పూర్‌లో ల్యాండ్ చేసి ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపారు. ఆ తరువాత.. వారికి అవసరమైన భద్రతా తనిఖీలు చేపట్టారు.
ఏపీలో వర్షాలు, వరదలపై హోం మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలను వర్షాలు, ముంచెత్తాయని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర మొత్తమ్మీద ముంపు బారిన పడిన 294 గ్రామాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 13, 227 మందిని ప్రభుత్వ పునరావాస శిబిరాలకు ప్రభుత్వం తరలించిందని పేర్కొన్నారు.
Nalgonda : నల్గొండ జిల్లా దేవరకొండ గురుకుల హాస్టల్లో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేవరకొండలోని కొండభీమనపల్లి గురుకుల పాఠశాలలో రెండు రోజుల క్రితం జరిగింది.
భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. జిల్లాలు, శాఖల వారీగా తాజా పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై చంద్రబాబు రివ్యూ చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా రియల్ టైంలో పరిస్థితిపై అధికార యంత్రాంగం స్పందించాలని సీఎం ఆదేశించారు.
దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య వాణి మధ్య వివాదానికి కారణమైన దివ్వెల మాధురి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దువ్వాడ శ్రీనివాస్, మాధురి మధ్య జరిగిన ఫోన్ సంభాషణగా భావిస్తున్న ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దానిపై ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది. దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
భారీ వర్షాల వల్ల జరిగిన విద్యుత్ శాఖ నష్టంపై అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష నిర్వహించారు. వీటీపీఎస్‌లోకి భారీగా వర్షపు నీరు చేరటం వల్ల 2500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని మంత్రి తెలిపారు. నీటిని తోడే పనులు నిర్విరామంగా సాగుతున్నాయన్నారు.