HYDRA : హైడ్రా కీలక నిర్ణయం.. నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని హైడ్రా ప్రకటించింది. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని, కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామని హైడ్రా పేర్కొంది. ఇప్పటికే నిర్మించి నివాసం ఉండే ఇళ్లను కూల్చమని హైడ్రా వెల్లడించింది. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయొద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. అయితే.. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలు , లేఅవుట్లు హైడ్రా తొలగించింది. హైదరాబాద్ ట్రైసిటీలోని చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలు, పాటు లేఅవుట్లను హైడ్రా విభాగం ఆదివారం కూల్చివేసారు. హైదరాబాద్ ట్రై సిటీ పరిధిలో ని చెరువుల్లో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలపై హైడ్రా విభాగం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా హైడ్రా విభాగం అధికారులు స్థానిక రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పోలీసుల ఆధ్వర్యంలో మాదాపూర్ లోని సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మిస్తున్నటువంటి నాలుగు అంతస్తులు , రెండు అంతస్తుల భవనాలు , ముప్పైకిపైగా షెడ్ లను అధికారులు కూల్చివేసి పది ఎకరాల చెరువు భూమిని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
Popular TV Actor Passed Away: టీవీ పరిశ్రమలో విషాదం..గుండెపోటుతో 48 ఏళ్ల ప్రముఖ టీవీ నటుడు కన్నుమూత
Also Read
- Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
ఇదే రీతిలో దుండిగల్ కొత్వా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి పదకొండు డూప్లెక్స్ విల్లా భవనాలను అధికారులు తొలగించి రెండు ఎకరాల చెరువును తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో అమీనా పూర్ పెద్ద చెరువు ఎఫ్. టి. ఎల్, బఫర్ జోన్ పరిధిలోని యాభై ఒక ఎకరాల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, అలాగే రోడ్లను సైతం ఆక్రమిస్తూ పద్మావతి నగర్ లో ఏర్పాటు చేసిన అక్రమ లేవుట్ కు సంబంధించిన ప్రహరీ గోడతో పాటు రెండు సెక్యూరిటీ గదులను అధికారులు తొలగించారని హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ వెల్లడించారు. ముఖ్యంగా నగరవాసులు ఇకపై తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకొనే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా వ్యహరించాలని ప్రధానంగా అపార్ట్మెంట్లు, వ్యక్తిగత ఇండ్లు అలాగే స్థలాలు కొనుగోలు చేసే ముందు ఇవి ఎఫ్. టి. ఎల్, బఫర్ జోన్ పరిధిలో వుందా లేదా అని ముందుగా ప్రజలు నిర్ధారించుకొవాలని హైడ్రా కమిషనర్ ప్రజలకు సూచించారు.
Variety Ganesha: మోడీతో కలిసి చాయ్ తాగుతున్న వినాయకుడు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
తాజావార్తలు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!