పదేళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై శ్రీలంక క్రికెట్ జట్టు గెలుపొందింది. పాతుమ్ నిస్సాంక సెంచరీ సాధించడంతో శ్రీలంక ఈ ఘనత సాధించింది. ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరుగుతుంది. అందులో భాగంగా లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో మూడో, చివరి మ్యాచ్ జరిగింది. ఈ సిరీస్లో 0-2తో వెనుకబడిన శ్రీలంక.. చివరి టెస్టులో పుంజుకుని 8 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ జట్టును ఓడించింది.
గణేష్ నవరాత్రుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా ప్రతిష్టించిన విగ్రహాల రూపంలో ఆ గణనాథుడు వివిధ అవతారాలలో దర్శనమివ్వడం మనం చూస్తాము. స్పోర్ట్స్ స్టార్ నుండి IT ఉద్యోగి వరకు, విఘ్నేషుడు గతంలో అనేక అవతారాలలో కనిపించాడు, ఎందుకంటే శిల్పాలు తరచుగా వాటి డిజైన్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలాంటి ఒక ప్రత్యేక ప్రదర్శనలో, గణేషుడు హైదరాబాద్లో మోటార్సైకిల్పై కూర్చొని ‘బైకర్’గా మారిపోయాడు. నగరంలోని రాజేంద్రనగర్లోని బుద్వేల్ ప్రాంతంలోని బన్సీలాల్ నగర్లో బజరంగ్ యూత్ అసోసియేషన్ ప్రతిష్టించిన…
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, అన్ని అవయవాలు మెరుగైన ఆక్సిజన్ పొందడానికి.. శ్వాసక్రియకు సహాయపడే అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడం చాలా ముఖ్యం. ప్రస్తుత కాలంలో.. చాలా మంది తరచుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా అలాంటి సమస్యల బారిన పడినట్లయితే.. సమయానికి నిపుణుల నుండి సలహా తీసుకోండి. లేదంటే.. ఇది తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకు దారి తీస్తుంది.
విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. వీఆర్వో జయలక్ష్మీకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన షోకాజ్ నోటీస్ జారీ చేశారు.
బుడమేరుకు సంబంధించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా వంటి వ్యవస్థ కంటే ముందుగా ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బుడమేరు ఆక్రమణలు చాలా మంది తెలిసో తెలియకో చేసిన వారు ఉన్నారని ఆయన అన్నారు. ఆక్రమణ స్థలం అని తెలియక కొన్నవారు కూడా ఉన్నారన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హత కల్గిన రైతులందరికీ రుణమాఫీ అవుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో ఆయన పర్యటించారు.. మండలంలో ఇంటివల మరణించిన పలువురి మృతుల కుటుంబాలను పరామర్శించారు. గంగారం మోడల్ స్కూల్, ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెల్సుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..రుణమాఫీ పై కొంత మంది ప్రతిపక్ష నాయకులు సాంకేతిక…
అదిగో చిరుత, ఇదిగో చిరుత అంటూ చిరుత సంచారం రాజమండ్రి శివారు ప్రాంత ప్రజలను భయాందోళన గురిచేస్తుంది. నాలుగు రోజులుగా కంటిపై కునుకు లేకుండా. భయంతో బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని భయపడుతున్నారు . చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలకు ఉపశమనం..రాజీనామాకు రైల్వే శాఖ ఆమోదం వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాల రాజీనామాలను భారతీయ రైల్వే సోమవారం ఆమోదించింది. శుక్రవారం కాంగ్రెస్లో చేరడానికి ముందు, ఇద్దరు రెజ్లర్లు తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేశారు. కాంగ్రెస్లో చేరిన వెంటనే, పార్టీ తన రైతు విభాగంలో బజరంగ్ పునియాను చేర్చుకున్నప్పుడు, జులనా నుండి వినేష్కు హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు టిక్కెట్ ఇచ్చింది. ఆమె రాజీనామా ఆమోదించడంతో వినేష్ ఫోగట్కు పెద్ద ఊరట లభించింది. ఇప్పుడు…
వరద బాధితులకు చిన్నారి విద్యార్థుల విరాళంపై సీఎం నారా చంద్రబాబు అభినందనలు తెలిపారు. పాకెట్ మనీని వరద సాయంగా ఇవ్వడంపై ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై చర్య తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు సోమవారం ఇచ్చిన ఆదేశాలను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) స్వాగతించింది. హైకోర్టు తీర్పు అధికార కాంగ్రెస్కు చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. “ఈ తీర్పు కాంగ్రెస్ అప్రజాస్వామిక పద్ధతులకు గణనీయమైన ఎదురుదెబ్బ. పార్టీ మారిన వారు అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని స్పష్టంగా తెలియజేస్తోంది. న్యాయస్థానం తీర్పు ప్రజాస్వామ్యానికి దక్కిన…