Atchannaidu: పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు.. మొదటి దశలో 50 కొనుగోలు కేంద్రాలు
- పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు - మంత్రి అచ్చెన్నాయుడు
- మార్కెటింగ్ శాఖ.. సీసీఐ పరిధిలో 50 పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
- పత్తి కొనుగోలుకు మార్గదర్శకాలు- అచ్చెన్నాయుడు
- గరిష్టంగా రూ.7521/- మద్దతు ధరకు కొనుగోలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా పత్తి కొనుగోళ్ల ప్రక్రియ జరిగే విధంగా చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మార్కెటింగ్ శాఖ, కాటన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొదటి దశలో 50 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వం గరిష్టంగా రూ.7521/- మద్దతు ధరకు కొనుగోళ్లు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు, కొనుగోలు ప్రక్రియకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Also Read
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలు జారిపడిపోయిన హిట్ మ్యాన్..
- TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
- Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
రాష్ట్రంలో ఈ ఏడాది 5.79 లక్షల హెక్టార్లలో 6 లక్షల టన్నుల దిగుబడి అంచనా వేసినట్లు తెలియచేశారు. సీసీఐ, మార్కెటింగ్ శాఖ గుర్తించిన మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల్లోనే కొనుగోళ్లు జరిగే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆద్వర్యంలో కొనుగోళ్ల ప్రక్రియ జరగడంతో పాటు ఆన్లైన్ కొనుగోలు విధానం కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ను కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ప్రమాదాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవడంతో పాటు.. సీసీ కెమేరాల ఏర్పాటు, బీమా సదుపాయం కలిగి ఉండాలని అధికారులను ఆదేశించామన్నారు. పత్తి సేకరణకు కొనుగోలు కేంద్రాల్లో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇచ్చామని, రైతుల ప్రయోజనం కోసం సాయంత్రం 6 గంటల వరకు అంటే అదనంగా ఒక గంట గ్రేస్ పిరియడ్ గా కేటాయించామన్నారు. పత్తి కొనుగోలు కార్యకలాపాలు సక్రమంగా నిర్వహించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్, మర్కెటింగ్, వ్యవసాయ అధికారులు, పోలీసు, అగ్నిమాపక అధికారులతో కలిపి కమిటీ ఏర్పాటు చేసామని మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
-
Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో…
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలు జారిపడిపోయిన హిట్ మ్యాన్..
-
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
-
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!