రాష్ట్రానికి కావాల్సిన అంశాలను కమిషన్ ముందు పొందుపరిచామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కమిషన్ ముందు అర్బన్ డెవలప్మెంట్ పై దాన కిషోర్, ఇతర అంశాల సీఎస్ శాంతకుమారి ప్రజెంటేషన్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కు ప్రోత్సాహకాలు ఎక్కువగా ఉండాలని కోరాని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వం తయారీ పథకాలకు అనుమతి ఇవ్వాలని కోరామని, ధనిక రాష్ట్రం అయిన తెలంగాణను గత ప్రభుత్వాల పాలన వల్ల అప్పుల పాలైందని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే జీతాల కంటే అప్పులకు వడ్డీలే ఎక్కువగా ఉన్నాయని, తెచ్చిన అప్పులు ఆ ప్రభుత్వాలు ఖర్చు చేసి వెళ్లిపోయారు.. ఇప్పుడు మాపై అప్పుల భారం పడిందని ఆయన వెల్లడించారు. అప్పుల భారం తగ్గించడానికి రీ స్ట్రక్చ్చరింగ్ చేయాలని ఫైనాన్స్ కమిషన్ ను కోరామని, ఇప్పుడున్న 41శాతం కాకుండా 50:50 ఉండేలా రికమెండ్ చేయాలని కోరాన్నారు భట్టి విక్రమార్క.
పర్కాపిటా ఇన్కమ్ బేసిస్‌గా నిధుల పంపిణీ సరైంది కాదని కమిషన్ ముందు చెప్పామని, గత పాలకుల ఫ్యూడల్ వ్యవస్థ వల్ల తెలంగాణ రాష్ట్రంలో అసమానత పెరిగిందని భట్టి విక్రమార్క తెలిపారు. GSDP ను ఆధారంగా తీసుకొని రాష్ట్రాలకు నిధుల కేటాయింపు ఉండాలని కోరామని, గ్రామాల్లో అభివృద్ధి కోసం పథకాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరామన్నారు భట్టి విక్రమార్క. విద్యా వ్యవస్థలో పలు కార్యక్రమాలు చేపడుతున్నాం…వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరామని, ఉద్యోగ కల్పన, హైదరాబాద్ మూసి అభివృద్ధి, RRR, ఫోర్త్ సిటీ, AI వ్యవస్థ, స్పోర్ట్స్ – స్కిల్ యూనివర్సిటీ కి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరామన్నారు. గ్రామాలు మహిళల అభివృద్ధి కోసం వడ్డీలేని రుణాల కోసం ఏడాదికి 20వేల కోట్లు ఇవ్వాలని కోరామని, ఈటల రాజేందర్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు అనుకుంటున్నానని ఆయన అన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను గత ప్రభుత్వం డైవర్ట్ చేసింది అంటే ఈటల రాజేందర్ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారని, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ను గత ప్రభుత్వం వాడుకోలేదు…ఇప్పుడు మేము వాడుకుంటాం అని చెప్పామన్నారు.
Electrical tractor: రూ.14 ఖర్చుతో కిలోమీటర్ ప్రయాణం.. ఈ-ట్రాక్టర్ స్పెషల్ ఇదే..!