రాజేంద్రనగర్ పోలీసులతో పాటు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు ఆపరేషన్ నిర్వహించి అంతరాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకున్నారని డీసీపీ రాజేంద్రనగర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 17 వద్ద గంజాయి తరలిచే ముఠాను పట్టుకున్నామని ఆయన తెలిపారు. ముఠా లోని ఐదుగురు నిందితులను పట్టుకున్నామని, సచిన్ ఠాగూర్ సింగతో పాటు వినోద్ అనే వ్యక్తలు ఈ ముఠా లో కీలక నిందితులు అని ఆయన పేర్కొన్నారు. ఇద్దరూ కలిసి గత ఐదు సంవత్సరాలుగా గంజాయి విక్రయిస్తున్నారని, ఇద్దరు గంజాయిని అరకులో కొని ఉత్తరప్రదేశ్ తో పాటు మహారాష్ట్రలో విక్రయిస్తారన్నారు. అరకులో రాజు అనే వ్యక్తి దగ్గర గంజాయి కొని ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ ఘడ్ జిల్లా కు తరలిస్తారని డీసీపీ తెలిపారు. ప్రతాప్ ఘడ్ లో గంజాయిని అమిత్ సింగ్ అనే వ్యక్తి రిసీవ్ చేసుకుంటాడని, అతని ద్వారా ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాలతో పాటు మహారాష్ట్రకు గంజాయి చేరుతుందన్నారు. సచిన్ సింగ్ ఉత్తరప్రదేశ్లో సునీల్ సింగ్ అనే వ్యక్తితో ఒక కంట్రీమేడ్ వెపన్ కొన్నాడని, అరకు నుండి గంజాయి తరలింపు కోసం ముంబై నుండి మరో ముగ్గురిని రప్పించాడన్నారు డీసీపీ శ్రీనివాస్.
Bhatti Vikramarka : రాష్ట్రానికి కావాల్సిన అంశాలను కమిషన్ ముందు పొందుపరిచాం
అంతేకాకుండా..’నదీమ్ సలీం తో పాటు మరొక వ్యక్తిని ముంబై నుండి గంజాయి సప్లై కోసం సచిన్ రప్పించాడు. నదీమ్ సలీం తో పాటు మరొక వ్యక్తి ఏడవ తేదీ విజయవాడ వచ్చారు. వస్తూ వస్తూ ముంబై నుండి రెండు కార్లను తీసుకొచ్చారు.. అక్కడినుండే కార్లు ఏడుగురు అరకు వెళ్లారు. అరకులో రాజు వద్ద 254 కేజీల గంజాయినీ కొని కారులో హైదరాబాద్ మీదుగా తరలించే ప్రయత్నం చేశారు. ఒక వాహనానికి ఒరిస్సా నెంబర్ ప్లేట్ తగిలించి అందులోని మొత్తం గంజాయి ప్యాక్ చేసి తరలించారు. మరొక వాహనం ఎంజాయ్ తరలించే వాహనానికి ఎస్కార్ట్ గా ముందు వెళ్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు ఎక్సెట్ నెంబర్ 17 వద్ద గంజాయిని వేరొక వాహనంలో తరలించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. సమయానికి చేరుకొని ఐదుగురును అదుపులోకి తీసుకున్నాం మరో ఇద్దరు పరారీలా ఉన్నారు. ఉదయం నుండి ఫైరింగ్ జరిగింది అని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి నిందితులను పట్టుకునే క్రమంలో ఎలాంటి ఫైరింగ్ జరగలేదు. సీజ్ చేసిన గంజాయిని కిలో 38000 చొప్పున కొన్నారు.. మొత్తం 88 లక్షల విలువ ఉంటుంది. ఐదుగురిని కోర్టులో హాజరపరచుతం. ఇద్దరి కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తాం. నిందితులను కష్టడిలోకి తీసుకొని గత నేర చరిత్రపై దర్యాప్తు చేస్తాం. మూడు నెలల్లో మూడుసార్లు అరకు నుండి నిందితులు గంజాయి అయిన రవాణా చేశారు.’ అని డీసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు.
Tata: టాటా EV కార్ కొనాలనుకుంటున్నారా, ఇదే మంచి అవకాశం.. రూ. 3 లక్షల వరకు తగ్గింపు..