ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ ఆధిక్యమెంతంటే..? బంగ్లాదేశ్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్ (33*), రిషబ్ పంత్ (12*) ఉన్నారు. భారత్ 308 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలోనే రెండు…
ఓ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మొదట ఆ ప్రాంతంలో రవాణా మార్గాలు మెరుగవ్వాలనేది ఆర్థిక శాస్త్ర ప్రాథమిక సూత్రం. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని రోడ్లు బాగుపడాలని, గ్రామాల మధ్య అనుసంధాన రహదారులు నాణ్యతతో ఉండాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పల్లెదారులకు అవసరమైన నిధులను ఏషియన్ ఇన్ఫాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకు (ఏఐఐబీ) సమకూరుస్తుందన్నారు.
అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 10 జిల్లాల జాయింట్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించామన్నారు.
ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ కు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈ రోజు 14 విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ముఖాన్ని మొబైల్ బేస్డ్ యాప్ లో క్యాప్చర్ చేసింది ఐటీ విభాగం.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై ఫేషియల్ అటెండెన్స్ పనిచేయనుంది. 39 విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది హాజరు కు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్‌కు సిద్ధం చేస్తోంది జీహెచ్ఎంసీ. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టంను ఏప్రిల్, 2024…
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా స్పందించారు. శ్రీవారి లడ్డూ కల్తీ గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు ఆయన అన్నారు. స్వచ్ఛమైన నెయ్యి ధర ఎక్కువ ఉంటుందన్న పవన్ కల్యాణ్.. తక్కువ ధరకు వస్తుందని ఎలా కొంటారని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సాధారణంగా కిడ్నీలలో రాళ్లంటే చిన్నచిన్నవి ఉంటాయి. కానీ.. దాదాపు కిడ్నీ మొత్తం ఆవరించి, బయట కటివలయంలోకి కూడా వచ్చిన దుప్పికొమ్ము ఆకారంలోని రాయి ఉండడం చాలా తీవ్రమైన సమస్య. దాదాపు 80 మి.మీ. కంటే పొడవున్న ఈ రాయి ఇంచుమించు కిడ్నీ ఆకారంలోనే పెరగడంతో మూత్రనాళానికి అడ్డం పడదు, దాంతో నొప్పి తెలియదు, వాపు కూడా అంతగా ఉండదు. అందువల్ల రోగులకు ఇది ఉందనే విషయమే తెలియదు. ఇలాంటి తీవ్రమైన సమస్యను అత్యున్నత సాంకేతిక నైపుణ్యంతో తొలగించారు…
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో అర్హులైన 200 మందికి ఇళ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. భూసేకరణ చేయాలని అధికారులను ఆదేశిస్తున్నామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయ్యింది.. మీటింగ్ పెట్టాలనుకుంటే ఒక లక్ష మందితో పెట్టొచ్చు.. ప్రజలను చూడటానికి వచ్చా తప్ప.. ఆర్భాటాలు.. హంగుల కోసం కాదని సీఎం చంద్రబాబు అన్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (కేఎల్ఐఎస్)పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మల్లన్న సాగర్ రిజర్వాయర్, ఇతర జలాశయాలు నిరూపిస్తున్నాయని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు . “కేఎల్ఐఎస్ విఫలమైతే నీటిపారుదల శాఖ 21 టీఎంసీల నీటిని మల్లన్న సాగర్‌లోకి ఎలా పంపుతుంది? అని హరీశ్ రావు ప్రశ్నించారు. శుక్రవారం మల్లన్న సాగర్‌ను సందర్శించేందుకు ఎమ్మెల్సీలు పి వెంకట్రామిరెడ్డి, డాక్టర్ వి యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, వంటేరు…
వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఉదయభాను పంపారు. తాను వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్నానని.. వైఎస్సార్, జగన్‌కు ముఖ్య అనుచరుడిగా కలిసి నడిచినట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
కలోంజి గింజలు (నల్ల జీలకర్ర) అందరి ఇళ్లలో వంటగదిలో ఉంటాయి. ఇవి ఆహార రుచిని రెట్టింపు చేయడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కలోంజి గింజల నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కలోంజి గింజలు తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక సమస్యలు తొలగిపోవడంతో పాటు వ్యాధులు కూడా దూరమవుతాయి.