హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అధ్యక్షతన మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వాడకం పై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హైదరాబాద్, రాచకొండ సీపీ లు హాజరయ్యారు. వీరితో పాటు GHMC కమిషనర్ అమ్రాపాలి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాజసింగ్, MIM ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ప్రతినిధులు, మత సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ..…
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన పెసా యాక్ట్ నేషనల్ కాన్ఫరెన్స్‌లో తెలంగాణ తరుఫున మంత్రి సీతక్క పాల్గొన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ట్రైబల్ శాఖ అధికారులు, పెసా యాక్ట్ కోర్దినేటర్లు, ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పదిరాష్ట్రాలలో పెసా యాక్ట్ అమలులో ఉందని, పెసా యాక్ట్ అమలులో తెలంగాణలో ఉన్న సమస్యలను ఈ సమావేశం దృష్టికి తీసుకువెళ్ళామన్నారు. పెసా యాక్ట్ ఉన్న గ్రామాల్లో గ్రామ…
రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నేరేవేర్చే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని ఆయన సూచించారు. నైపుణ్య శిక్షణ శాఖ, ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్, ఇండస్ట్రీస్, సెర్ప్ శాఖ అధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోను బీసీసీఐ (BCCI) షేర్ చేసింది. అందులో.. గిల్‌కు రిషబ్ పంత్ బౌలింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రోజు ప్రాక్టీస్ సెషన్లో భాగంగా పంత్ బౌలింగ్ చేయడం కనిపించింది. కాగా.. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో 30వ వార్డులోని ఎచ్చర్ల వీధిలోని ప్రభుత్వ పాఠశాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. లోకేష్ పర్యటన నేపథ్యంలో స్కూల్ వద్ద దుర్బర పరిస్థితి నెలకొంది. భారీ వర్షం కారణంగా పాఠశాల ప్రాంగణంలో వర్షపునీరు నిలిచిపోయింది.
సరిహద్దు ఉద్రిక్తతలను పరిష్కరించడానికి ఇండియా-చైనా కార్ప్స్ కమాండర్-22వ రౌండ్ ఉన్నత స్థాయి చర్యలు మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19న జరిగిన 21వ రౌండ్ చర్చల తర్వాత.. రెండు అణ్వాయుధ పొరుగు దేశాల మధ్య సంభాషణలో భాగంగా ఏడు నెలల నుంచి సైనిక సమావేశాలు జరగలేదు.
రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, హోం, నైపుణ్యాభివృద్ధి, సాంఘిక, బీసీ, గిరిజన మహిళా శిశు సంక్షేమం విభిన్న ప్రతిభా వంతుల శాఖలతో పాటు, గృహ నిర్మాణ, వ్యవసాయ, వైద్య ఆరోగ్య, మత్స్య శాఖలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరును,…
ముంబైలో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. భారీ వర్షాలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. అంధేరీలో మ్యాన్‌హోల్‌లో పడి ఓ మహిళ మృతి చెందింది. ఆ మహిళను 45 ఏళ్ల విమల్ గైక్వాడ్‌గా గుర్తించారు.
పవన్‌పై పేర్ని నాని వ్యాఖ్యలపై నిరసనగా పేర్ని నాని ఇంటి ముందు జనసేన నేతలు ఆందోళన చేపట్టారు. పేర్ని నాని దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ క్రమంలో భారీగా పోలీసులు మోహరించి.. జనసేన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కంగనా రనౌత్ సినిమా 'ఎమర్జెన్సీ' విడుదలపై నిషేధం విధించడంపై బాంబే హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. ఎమర్జెన్సీ చిత్రం విడుదలకు మార్గం సుగమం అయింది. ఈ చిత్రాన్ని విడుదల చేయవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తెలిపింది. అయితే.. సెన్సార్ బోర్డ్ రివ్యూ కమిటీ సూచనల మేరకు సినిమాలో కొన్ని కట్స్ చేయాల్సి ఉంటుంది.