Ponnam Prabhakar: ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్.. మొదటి అభ్యర్థన స్వీకరించిన మంత్రి పొన్నం
- తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం..
- గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసి ప్రజావాణి అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసి ప్రజావాణి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రజావాణి కార్యక్రమం మాదిరిగానే ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు (బుధ, శుక్రవారాలు) జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఉదయం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి ప్రారంభించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్నా షేక్ హుస్సేన్ కుటుంబం నుండి మొదటి అభ్యర్థనను మంత్రి పొన్నం ప్రభాకర్ స్వీకరించారు. సమస్యల వినతి కోసం గల్ఫ్ కార్మికులు భారీగా పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు సమస్యలపై పెద్ద ఎత్తున తరలి వచ్చారని తెలిపారు.
Read also: President Droupadi Murmu: రేపు రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ట్రాఫిక్ ఆంక్షలు
Also Read
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల్లో చెప్పినట్టు 4 అంశాల పై నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అందులో మొదటిది తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రజా భవన్ లో ప్రవాసి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్రం నుండి గల్ఫ్ దేశాలకు పెద్ద ఎత్తున ఉపాధి నిమిత్తం వెళ్ళారని తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. గల్ఫ్ ప్రమాదంలో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్ఫ్ గ్రెషీయ ఇవ్వడానికి ఇప్పటికే జీవో జారీ చేసుకున్నామన్నారు. గల్ఫ్ కార్మికుల కుటుంబాల పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా గురుకులాల్లో సీట్లు కల్పిస్తున్నామని తెలిపారు. గల్ఫ్ కార్మికుల కోసం ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి ప్రాతినిద్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో అడ్వైజరి కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
Read also: Konda Surekha: అటవీశాఖ సిబ్బంది పై దాడి ఘటన.. చర్యలు తీసుకోవాలని కొండా సురేఖ ఆదేశం..
నా నియోజకవర్గంలో జాబ్ మేళా పెడితే 9 వేల మంది వచ్చారన్నారు. విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం పోయేవరికి అక్కడి చట్టాలు తెలియడం లేదని తెలిపారు. వారికి ఇక్కడి కంపెనీలపై అవగాహన కల్పించాలన్నారు. వాటిపై విస్తృత సమాచారం అందించాలని తెలిపారు. సంస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రజలను మోసం చేస్తూ విదేశాలకు పంపించి అక్కడ ఇబ్బందులు పడేలా చేస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.. అక్కడ శిక్షణ పొంది విదేశాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రజావాణి తీసుకురావడానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలని మంత్రి తెలిపారు.
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా. పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలశ్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!