Ponnam Prabhakar: తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసీ ప్రజావాణి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
జలసౌధలో కొత్తగా నియమితులైన AEEలకు నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల భావోద్వేగం వ్యవసాయం, నీరు అని ఆయన అన్నారు. ఇది ఉద్యోగం కాదు.. ఇది భావోద్వేగమని ఆయన అన్నారు. ఇంజనీర్లు, అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లడం లేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంజనీర్లుగా ఈ ఉద్యోగం మీకు కేవలం ఉద్యోగం మాత్రమే కాదని.. తెలంగాణ ప్రజల భావోద్వేగం అని గుర్తుపెట్టుకొని…
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు పవన్ కల్యాణ్ తిరుపతికి చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు కాలినడకన అలిపిరి మార్గంలో పవన్ కల్యాణ్ తిరుమలకు వెళ్లనున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయన్నారు. బతుకమ్మ చీరలపై ప్రజలకు క్షమాపణలు చేయాల్సింది పోయి నేతన్నల పై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం మొగోడే కాబట్టి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ప్రజా పాలన అందిస్తున్నాడని ఆయన అన్నారు. కేటీఆర్ మాట్లాడే దురహంకార పొగరు మాటలను ప్రజలు చీత్కకరిస్తున్నా కూడా మారడం…
అసలు వాళ్ళకు పదవులు ఉన్నట్టా? లేనట్టా? ఆఫీస్కు వెళ్ళాల్నా? అవసరం లేదా? ఆ విషయంలో పీసీసీ అధ్యక్షుడితో సహా తెలంగాణ కాంగ్రెస్లో ఎవ్వరికీ క్లారిటీ లేదు. అందుకే వాళ్ళు గాంధీభవన్ ముఖం చూడ్డం కూడా మానేశారట. పవర్లో ఉన్న పార్టీకి అంత గందరగోళం ఎందుకు? అలా కన్ఫ్యూజ్ అవుతున్న ఆ నాయకులు ఎవరు? ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?
సీబీఐకి అనుమతి నిరాకరణ.. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ముడా ల్యాండ్ స్కాం నేపథ్యంలో కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు కర్ణాటక హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంచలనంగా మారింది. ఈ కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో దీనిపై సీబీఐ విచారణ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు సిద్ధరామయ్య…
మహబూబాబాద్ జిల్లా లోని పలు రైస్ మిల్లుల పై రాష్ట్ర సివిల్ సప్లైస్, టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 24 కోట్ల 55 లక్షల 33 వేల రూపాయల సి.ఎం.ఆర్ ధాన్యం ను మాయం చేసిన 3 రు రైస్ మిల్లుల యజమానుల పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఓ.ఎస్.డి ప్రభాకర్ మాట్లాడుతూ, ఖరీఫ్ , రబీ లో ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంను కస్టం…
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మూడు పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించారు. నేషనల్ సూపర్కంప్యూటింగ్ మిషన్ (NSM) కింద భారతదేశం యొక్క శాస్త్రీయ, సాంకేతిక పురోగతి సాధనలో ఈ చర్య ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
ఎలాంటి ప్రత్యామ్నాయం, పునరావాసం కల్పించకుండానే హైదరాబాదు మూసీ నది పరిసర ప్రాంతాల్లో దశాబ్దాలుగా నివాసముంటున్న పేదల ఇండ్లు, గుడిసెలను హైడ్రా అధికారులు వెంటనే తొలగించేందుకు పూనుకోవడాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా పునరావాసం కల్పించిన తర్వాతనే ఇండ్లను కూల్చే పనిని చేపట్టాలని, మూసీ అభివృద్ధి పేరుతో పేదలను ఇబ్బందులకు గురిచేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నదన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో…