మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. గత తెలుగు దేశం ప్రభుత్వంలో క్రీడా రంగానికి ప్రోత్సాహం ఇచ్చామని... నాడు పలు స్టేడియాలు, క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపడితే.. గత ప్రభుత్వం అన్ని పనులు నిలిపివేసిందని చంద్రబాబు నాయుడు అన్నారు.
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో కస్టమర్లు కొత్త ఐఫోన్ను కొనుగోలు చేయడానికి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే.. ఐఫోన్ మోడల్స్ పై భారీ తగ్గింపు ధరలు ప్రకటించారు. లాంచ్ చేసిన ధర కంటే ఇప్పుడు ధరలు భారీగా తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. రూ. 30,000 వరకు తగ్గింపును పొందవచ్చు.
ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూ కుంభకోణమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోర్త్ సిటీ పేరుతో తన సోదరులకు వేల కోట్లు లబ్ధి చేసే కుట్ర అని, ఫార్మాసిటీ వ్యవహారంలో ప్రభుత్వం పై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఫార్మాసిటీ ఉన్నట్టా? లేనట్టా స్పష్టం చేయండని, కోర్టులో మాత్రం ఫార్మాసిటీ కొనసాగుతుందంటూ న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఫార్మాసిటీని రద్దు చేస్తే రైతుల భూమి వారికి అప్పగించాలని,…
"మాజీ ముఖ్యమంత్రి జగన్ దేవుడి జోలికి వెళ్తే ఏమైందో గత ఎన్నికల్లో మీరంతా చూశారు. మనం ఏమతానికి చెందిన వారమైనా అన్నిమతాలను గౌరవించాలి. మేం చర్చి, మసీదులకు వెళ్లినపుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటాం. తిరుమల వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే సాంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందని" రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రెడ్ బుక్ పని ప్రారంభమైంది..తప్పుచేసిన వారిని వదలమన్నారు.
బంగ్లాదేశ్ జట్టు దిగ్గజ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే.. అతని రిటైర్మెంట్ తక్షణమే అమల్లోకి రాలేదు. వెంటనే అమలులోకి వచ్చేలా టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా.. రేపటి నుంచి కాన్పూర్లో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్లో షకీబ్ అల్ హసన్ ఆడనున్నాడు. ఆ తర్వాత.. మరో టెస్ట్ సిరీస్ లో ఆడనున్నాడు.
ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ పనితీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్ష నిర్వహించారు. తమ విభాగంలో చేపడుతున్న కార్యక్రమాలపై ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. హైడ్రా దూకుడు పేదలపై కాకుండా బాధితులతో చర్చించండని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇతర భాగస్వామ్య పక్షాలను పరిగణలో తీసుకోండని, 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లు అక్రమమని సర్కార్ కూల్చివేస్తే వారి బాధ ఎవరికి చెప్పుకోవాలన్నారు కిషన్ రెడ్డి. అక్రమంగా భూములు అమ్మినవారినీ బాధ్యులను చేయాలి, వారి పై చర్యలు తీసుకోవాలని, రాత్రికి రాత్రి కట్టుబట్టలతో రోడ్డునపడేస్తే వాళ్ల బతుకులు ఏమై పోతాయన్నారు. పాలకుల,…
ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటో పెట్టండి.. అధికారులకు సర్కార్ ఆదేశం ప్రభుత్వం ఫైనల్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలని సర్కార్ ఆదేశించింది. అక్టోబర్ 7వ తేదీ లోపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటో ఏర్పాటు చేయాలని తెలిపింది. జిల్లా కలెక్టర్లు, డివిజన్, మండల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో నమూనాను కూడా విడుదల చేస్తూ.. ప్రభుత్వం కార్యాలయాల్లో సీఎం పెట్టాలని తెలిపింది. ఇప్పటికే…
రవీంద్ర భారతిలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధ్యక్షతన వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ 129వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. వీరితో పాటు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, బస్వరాజు సారయ్య, బీసీ కమిషన్ చైర్మన్ జీ.నిరంజన్, బీసీ కమిషన్ కమిషన్ సభ్యులు, బీసీ సంక్షేమ శాఖ కమీషనర్ బాల మాయాదేవి,…
ముంబయి నటి కాదంబరి జిత్వానీ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేశామని ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనితి వెల్లడించారు. ఈ కేసులో తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు.