యుఎన్ఎస్సిలో భారత్ శాశ్వత సభ్యత్వంపై బ్రిటన్ మద్దతు.. అమెరికా, ఫ్రాన్స్ తర్వాత UNSCలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం బ్రిటన్ మద్దతును పొందింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC శాశ్వత సీటు) కోసం ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ గురువారం భారతదేశానికి మద్దతు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రాన్స్‌కు చెందిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా భారత్‌కు మద్దతు పలికారు. న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 69వ సెషన్లో జరిగిన…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బ్యానర్లపై కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలాంటి బ్యానర్లు అంటించవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోస్టర్లు బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వాల్ పోస్టర్లు, వాల్ పెయింటింగ్స్ పై సీరియస్‌గా వ్యవహరించాలని సర్క్యులర్ జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. అంతేకాకుండా.. సినిమా థియేటర్ వాళ్ళు కూడ ఎక్కడా పోస్టర్లు అతికించకుండ చూడాలని డిప్యూటీ…
రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోపణలు చేశారని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. దగ్గరుండి కావాలని అబద్ధాలు చెప్పించి అనుమాన బీజాలు నాటారన్నారు. ప్రసాదం తినేవారిలో అనుమానాలు కలిగిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ స్వార్థం కోసం స్వామివారి విశిష్టతను దెబ్బతీస్తున్నారన్నారు. యానిమల్ ఫ్యాట్‌తో ప్రసాదాన్ని తయారు చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఇది ధర్మమేనా అంటూ ప్రశ్నించారు.
గజ్వేల్ ENC హరిరామ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్. కమిషన్ చీఫ్ 90కి పైగా ప్రశ్నలను అడిగారు. అయితే.. పలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ENC హరిరామ్ దాటవేసినట్లు తెలుస్తోంది. రేపు మరోసారి కమిషన్ ముందు ENC హరిరామ్ హాజరుకానున్నారు. ఇవ్వాళ సమాధానం చెప్పని ప్రశ్నలకు రేపు డాక్యుమెంట్స్ సమర్పిస్తామని హరిరామ్ చెప్పారు. అయితే.. ఇప్పటి వరకు కార్పొరేషన్ ద్వారా బ్యాంక్ లకు 29వేల 737 కోట్లు రీ…
రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. దేవుడు దర్శనానికి వెళ్తామని అనుకుంటే అడ్డుకునే పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు. నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని.. దేశంలో ఎక్కడా పరిస్థితులు ఏపీలో చూస్తున్నామన్నారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవుడి దర్శనానికి వెళ్తే అనుమతి లేదని అంటున్నారని.. ఆ కార్యక్రమంలో పాల్గొంటే అరెస్ట్ చేస్తామని నోటీసులు ఇస్తున్నారని జగన్ వెల్లడించారు.
హైడ్రా లక్ష్యం సంచులను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సమకూర్చడమే అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ప్రజల దృష్టిమరల్చడానికే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తెరపైకి తెచ్చిందని, ఉన్నఫలంగా నిరాశ్రయులను చేయడం ఎంత వరకు న్యాయమని ఆమె మండిపడ్డారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం బెంబేలెత్తిస్తోందని, హైదరాబాద్ అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందన్నారు డీకే అరుణ. హైదరాబాద్ రావాలంటే పెట్టుబడి దారులు భయపడాల్సిన పరిస్థితి అని, కేసీఆర్ కు మించిన అవినీతిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందన్నారు…
ఇండిగో ఎయిర్‌లైన్స్ అయోధ్య సహా ఏడు కొత్త నగరాలకు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభిస్తోంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కొత్త మార్గాలు హైదరాబాద్‌ను రాజ్‌కోట్, అగర్తల, జమ్మూ, ఆగ్రా, కాన్పూర్, అయోధ్య , ప్రయాగ్‌రాజ్‌లకు కలుపుతాయి. విమానయాన సంస్థ సెప్టెంబర్ 28న అయోధ్యకు నేరుగా విమానాన్ని ప్రారంభించనుంది, సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో వారానికి నాలుగు సార్లు నడుస్తుంది. జూన్ 1న స్పైస్‌జెట్ హైదరాబాద్ నుండి అయోధ్యకు తన డైరెక్ట్ విమానాలను నిలిపివేసిన తర్వాత…
గాజా, లెబనాన్లలో హమాస్-హిజ్బుల్లాతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ పై మరో దేశం ప్రతీకారం తీర్చుకునేందుకు రంగంలోకి దిగింది. శుక్రవారం ఉదయం యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు టెల్ అవీవ్‌పై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. అయితే ఈ క్షిపణిని ఇజ్రాయెల్ గాలిలోనే ధ్వంసం చేసింది. ఈ దాడి టెల్ అవీవ్-సెంట్రల్ ఇజ్రాయెల్‌లో తెల్లవారుజామున చేసింది.
కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టమని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన ఇవాళ విజయవాడ నుంచి తిరుపతికి నేటి సాయంత్రం వెళ్లాల్సి ఉంది. గతంలో నేటి రాత్రి తిరుమలలో బస చేసి రేపు(శనివారం) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.