Andhra Pradesh: ఏపీలో జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటనల కోసం రెండు అడ్వాన్స్ టీమ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో టీంలో సభ్యులుగా ఆరుగురు అధికారులను నియమించింది. రెవెన్యూ, పోలీస్, సమాచార శాఖ, ప్రణాళిక శాఖలకు చెందిన అధికారులతో అడ్వాన్స్ టీమ్‌లు నియామకమయ్యాయి. అడ్వాన్స్ టీం-1లో వేణుగోపాల్, రాజశేఖర్, రాంబాబు, రమణ, శాంతారావు, సూర్యచంద్రరావులు ఉన్నారు. అడ్వాన్స్ టీం-2లో కృష్ణమూర్తి, శివరాం ప్రసాద్, రాజు, శ్రీనివాసరావు, మల్లిఖార్జున రావు, నాగరాజాలు ఉన్నారు. అడ్వాన్స్ టీంలు ఏం చేయాలనే దానిపై ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో సీఎం పర్యటనలకు 24 గంటల ముందు క్షేత్ర స్థాయికి అడ్వాన్స్ టీమ్‌లు వెళ్లనున్నాయి.
Read Also: YS Jagan: రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోపణలు