మూసీ బఫర్ జోన్, FTL ను ఎక్కడ ముట్టుకోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూసీ ప్రజలకు 10వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లని కేటీఆర్ అనాడు ప్రకటించారని, అధికారంలో ఒకేలా! అధికారం కోల్పోతే మరోలా మేము మాట్లాడమన్నారు. మూసీ రివర్ బెడ్ నివాసాల సర్వే జరుగుతుంది…అక్రమ కట్టడాలు అయినా వాళ్లకు మునరావాసం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికలకు ముందు రింగ్ రోడ్డు 7వేల కోట్లకు అమ్ముకున్నది గత BRS కాదా!…
ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు వెల్లువెత్తాయి. వరద సాయం నిమిత్తం రూ.20 కోట్లను రిలయన్స్ కంపెనీ విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు రిలయన్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్కును అందజేశారు.
రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి ప్రేమ్‌చంద్ బైర్వా కుమారుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బైర్వా కొడుకు రీలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. వారి వెనుకాల పోలీసుల ఎస్కార్ట్ వాహనాలు వస్తున్నాయి. వీడియోలో ఓపెన్ జీపులో నలుగురు యువకులు కూర్చుని ఉన్నారు. కారులో కూర్చున్న యువకుల్లో ఒకరు డిప్యూటీ సీఎం ప్రేమ్‌చంద్ బైర్వా కుమారుడు ఉన్నాడు.
హైడ్రామా కమిషనర్ రంగనాథ్‌ను కోర్టుకు హాజరుకావాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. వచ్చే సోమవారం ఉదయం 10:30 గంటలకు హాజరు కావాల్సిందిగా ఆయనకు ఆదేశాలు అందాయి. ఇటీవల అమీన్పూర్లో హైడ్రా సంస్థ భవనాన్ని కూల్చివేసిన ఘటనపై కోర్టులో ఆందోళనలు వెల్లువెత్తడంతో వ్యాజ్యం ఉన్న భవనాన్ని ఎలా కూల్చివేశారని హైకోర్టు ఆరా తీసింది. హైడ్రా కమిషనర్ వ్యక్తిగతంగా లేదా లిఖితపూర్వకంగా స్పందించాలని కోర్టు ఆదేశించింది. ఈ పరిణామం హైడ్రా చర్యలపై న్యాయస్థానం యొక్క నిశిత పర్యవేక్షణను , చట్ట నియమాన్ని…
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ టార్గెట్‌గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంఎస్పి యొక్క పూర్తి అర్థం ఏంటో తెలుసా..? అని ప్రశ్నించారు. హర్యానాలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వం 24 పంటలను కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కి కొనుగోలు చేస్తోందని అమిత్ షా తెలిపారు.
తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని జానీ మాస్టర్ భార్య అయేషా అన్నారు. కావాలనే ఆ అమ్మాయి ఈ ఆరోపణలు చేసిందని ఆమె పేర్కొన్నారు. ఆమె ఏం కావాలని ఆశిస్తుందో తెలియదని.. అంతా దేవుడికి తెలుసన్నారు. పెద్ద ఆరోపణలు చేశారని.. ఇదంతా కోర్టులోనే తేల్చుకుంటామన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మైసూరు లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లాట్ల కేటాయింపులో కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పునరుత్పాదక విద్యుత్, వస్తు ఉత్పత్తిలో ఎంతో ముందు చూపుతో పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రం అమెరికన్ కంపెనీల భాగస్వామ్యాన్ని సహకారాన్ని కోరుతోందని, గ్లోబల్ సిటీ హైదరాబాద్ కు పెట్టుబడులతో తరలిరావాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఇంధనశాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అమెరికన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. అమెరికాలోని లాస్ వెగాస్ లో జరుగుతున్న మైన్ ఎక్స్ పో 2024 అంతర్జాతీయ సదస్సులో ఆయన గురువారం నాడు (సెప్టెంబర్ 26) ప్రపంచ వ్యాప్త వ్యాపార…
ఏపీలో జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటనల కోసం రెండు అడ్వాన్స్ టీమ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో టీంలో సభ్యులుగా ఆరుగురు అధికారులను నియమించింది. రెవెన్యూ, పోలీస్, సమాచార శాఖ, ప్రణాళిక శాఖలకు చెందిన అధికారులతో అడ్వాన్స్ టీమ్‌లు నియామకమయ్యాయి.