హైడ్రా కు సంబంధించి హై కోర్టు, సుప్రీంకోర్టు ఉందని, కస్టోడీయన్‌గా ప్రభుత్వం కూడా ఆస్తులకు రక్షణ గా ఉండి కాపాడుతుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. వ్యక్తుల ఆస్తులను కూల్చడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే అదనపు ప్రయోజనంఏమి లేదని, ఎవరికైనా అలాంటి నష్టం జరిగితే కింది స్థాయి నుండి ప్రిన్సుపల్ సెక్రెటరీ వరకు ఫిర్యాదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. దాంట్లో ఎలాంటి నష్టం జరగదనేది ప్రభుత్వం తరుపున కాంగ్రెస్ పార్టీ…
గత వారం రోజులుగా తిరుపతి లడ్డూపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోందని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. తిరుపతి లడ్డూపై చంద్రబాబు కుటిల రాజకీయాలను జగన్మోహన్ రెడ్డి బట్టబయలు చేశారన్నారు. వెంకటేశ్వరస్వామిపై చంద్రబాబు చాలా పెద్ద నింద వేశారన్నారు. ఆ నిందారోపణలు పోగొట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పూజలు చేశారన్నారు.
డబుల్ బెడ్ రూం ఇళ్లకోసం ప్రభుత్వ స్థలం లేకపోతే పాలకుర్తి నియోజకవర్గంలో రెండెకరాలు నాస్వంత ఖర్చులతో భూమి కొనుగోలు చేసి కట్టించానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇవాళ ఆయన జనగామ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇళ్లు లేని గ్రామాలు చాలా ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఇండ్లు కట్టించింది నేనే అని ఆయన వ్యాఖ్యానించారు. పేదలకు ఇండ్ల పట్టా సర్టిఫికేట్ ఇచ్చిన కూడా కాంగ్రెస్ వాళ్లు పేదలను ఇండ్లలో నుండి…
పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటి.. పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వానికి పేదల ఆశీస్సులు ఉండాలని, వారి గోసలు ఉండకూడదని తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హరీష్ రావు హైడ్రా బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం బాధితుల వద్దకు రానుందని తెలిపారు. హైడ్రా బాధితులంతా తమ కుటుంబ…
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది. తొమ్మిదేళ్ల తర్వాత ఇండియాలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
డిక్లరేషన్ వివాదంపై పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తిరుపతి కొండకు వెళ్లడానికి డిక్లరేషన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు అంటున్నారని.. కొండపైకి వెళ్లడానికి జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో జగన్‌ను టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలు, చెరువుల కాపాడడం కోసం హైడ్రాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో హైడ్రా చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన కట్టడాలను కూల్చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. పత్రికలలో, మీడియాలలో కూల్చివేతలపై వస్తున్న వార్తాలపై ఆందోళన వ్యక్తం అవుతోందన్నారు. మూసీ ప్రక్షాళన పై ప్రభుత్వ లక్ష్యంను సవివరంగా చెప్పాలనే ఉద్దేశ్యంతోనే మీడియా ముందుకు వచ్చామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రితో కలిసి…
దేశంలో పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా ఆరోగ్య రంగంపై ప్రతి సంవత్సరం అదనపు భారం పెరుగుతోంది. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులతో పాటు.. అనేక రకాల కాలేయ సంబంధిత వ్యాధులు ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ముప్పు గురించి భారత్ అలర్ట్ అయింది.
లడ్డూ వివాదంపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పందించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక తిరుపతి ప్రతిష్ఠ రోజురోజుకీ దిగజారిందని విమర్శించారు. అంతర్వేది రథం తగలబెట్టడం సహా అనేక ఘటనల్లో నాటి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపలేదన్నారు. కల్తీ నెయ్యి అంశం నిజమని, టెస్టు రిపోర్టులు వచ్చాయన్నారు.
కంట్రీమేడ్ తుపాకులు ఇల్లీగల్ సేల్ చేస్తున్న కాకినాడకు చెందిన సాయిరాం రెడ్డిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంద్భంగా రాచకొండ సీపీ సుధీర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడకు చెందిన సాయిరాంరెడ్డి బీకామ్ మధ్యలోనే ఆపేశాడని, ఈజీగా మనీ సంపాదించాలనుకున్నాడని, ఈ క్రమంలోనే డాన్‌గా మారి పెద్ద క్రిమినల్‌గా మారాలనుకున్నాడని ఆయన వెల్లడించారు. అందుకోసం ముంబైకి వెళ్ళి గన్స్ కొనుకొచ్చాడని, వెపన్ యూజ్ చేసి ఏదో ఒక నేరం చేయాలని అనుకున్నారని, ఇతనిని నుండి ఏడు…