తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర బృందంతో విచారణ జరిపించడం మంచిదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్ సూచించారు. ఈ బృందంలో ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు, , ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి ఉండాలని ప్రస్తావించారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు.
Rashmika Mandanna: మరీ అంత క్యూట్ గా చుడొదబ్బా.. కుర్రాళ్లకు హార్ట్ హార్ట్ ఎటాక్ వస్తే ఎలా!
సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటు నిర్ణయాన్ని ఆయన అభినందించారు. ఈ మేరకు, చంద్రబాబు “ఎక్స్” (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, “తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై దర్యాప్తుకు సీబీఐ, ఏపీ పోలీసులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను స్వాగతిస్తున్నాను. సత్యమేవ జయతే. ఓం నమో వేంకటేశాయ” అని ట్వీట్ చేశారు. ఈ తీర్పు సత్యం , న్యాయాన్ని సమర్థించడంలో కీలకమైన అడుగు అని, అన్ని సంబంధిత పక్షాల సమర్థనంతో దర్యాప్తు జరగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
SK25 : ఆ సినిమా నుండి తప్పుకున్నసూర్య, లోకేష్ కనకరాజ్..