ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం రేణిగుంట చేరుకుంటారు. అనంతరం శ్రీ బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. రాత్రి 9 గంటలకు బ్రహ్మోత్సవం సందర్భంగా శ్రీ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్దశేషు వాహనసేవలో పాల్గొంటారు. అనంతరం రాత్రికి శ్రీ పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. 5వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీ వకుళమాత కేంద్రీకృత వంటశాలను ప్రారంభిస్తారు. ఉదయం 9 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరుతుంది.
Italy: తప్పిన విమాన ప్రమాదం.. మంటలు చెలరేగగానే కిందకు దిగేసిన ప్రయాణికులు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకు జరగనున్నాయి. ఈ విషయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు ప్రకటించారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని విస్తృత ఏర్పాట్లు చేసామని ఆయన తెలిపారు. గురువారం, అన్నమయ్య భవనంలో జరిగిన మీడియా సమావేశంలో, ఈవో పలు వివరాలను వెల్లడించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహనసేవ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. భక్తులు ఈ విశేష ఉత్సవాలను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని టీటీడీ ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేసిందని చెప్పారు. అక్టోబర్ 4న ముఖ్యమంత్రి శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. అక్టోబర్ 5న, తిరుమల పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక రూ. 13.45 కోట్లతో నిర్మించిన వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయని టీటీడీ ఈవో అన్నారు.
Agra Shocker: కూతురు సెక్స్ స్కాండల్‌లో ఉందని బ్లాక్‌మెయిల్.. ఆగిన తల్లి గుండె..