పంజాబ్‌లోని ఓ గ్రామంలో సర్పంచ్ పదవిని వేలం వేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. గురుదాస్‌పూర్‌లోని హర్దోవల్ కలాన్ గ్రామంలో సర్పంచ్ పదవికి వేలం రూ. 50 లక్షలకు వేలం ప్రారంభం కాగా, స్థానిక బీజేపీ నాయకుడు ఆత్మా సింగ్ రూ. 2 కోట్లకు వేలంలో సర్పంచ్ సీటును సొంతం చేసుకున్నాడు.
లెబనాన్‌లోని హిజ్బుల్లాపై సైనిక చర్యను ప్రారంభించిన ఇజ్రాయెల్‌పై ఇరాన్ మంగళవారం క్షిపణులను ప్రయోగించింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా మృతికి ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని, ఎలాంటి ప్రతీకార చర్యలనైనా ఎదుర్కొనేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని ఇరాన్ ప్రకటించింది.
మా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో డిసెంబర్ 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ప్రభుత్వ నిర్ణయాలు క్లారిటీగా చెప్పారని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ మంత్రి మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా, మూసీ లాంటి కార్యక్రమాల గురించి చెప్పారని, పేద,మధ్యతరగతి కుటుంబ అవసరాలు తెలుస్కొని అవి తీర్చడానికే మా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. మాది పేద ప్రజల కోసం పని చేసే ప్రభుత్వమని, మూసీ నది ప్రక్షాళన…
తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది ప్రభుత్వం. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవడానికి వెంటనే జిల్లాలను సందర్శించాలని ప్రత్యేక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ప్రత్యేక అధికారిగా రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి నియమించారు. Sree Vishnu: మగ గొప్పా ? ఆడ గొప్పా ? అనేదే కథ : హీరో శ్రీవిష్ణు ఇంటర్వ్యూ కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి,…
‘పెళ్లి కోసం అంబానీ కోట్లు ఖర్చుపెట్టారు.. అది మీ డబ్బే’ హర్యానాలో అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీలలో తమ అభ్యర్థుల కోసం అన్ని పార్టీల నేతలు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం బహదూర్‌ఘర్‌లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రోడ్‌షో నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తన కుమారుడి…
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్పై తెలంగాణ ప్రభుత్వం మినిట్స్ విడుదల చేసింది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్ట్‌లో 2017లో- MRDCL సమావేశాల్లో చర్చించిన అంశాలు, 2018 – ప్రాజెక్ట్ చర్చల ప్రారంభం, MRDCL అధికారులతో 09.07.2018న సమావేశం నిర్వహించినట్లు పేర్కొంది. నదీ గర్భంలో ఉన్న ఆక్రమణలను లెక్కించాలని నిర్ణయించారని, బఫర్ జోన్ 1 నెల వ్యవధిలో నది సరిహద్దును సక్రమంగా ఫిక్సింగ్ చేస్తుందని తెలిపారు. పునరావాసం, భూమి కోసం ఒక నివేదిక తయారు…
తల్లి, అక్క, చెల్లి మధ్య ఉండే సంబంధం గురించి బీఆర్ఎస్ సోషల్ మీడియా సంస్కారహీనంగా పోస్టులు పెట్టిందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఒక అక్కకు తమ్ముడిగా ఆమెను అడిగి మరీ నూలు పోగు దండ వేశా అని, అలాంటి నూలు పోగు దండను ప్రధాని మోడీ వచ్చినప్పుడు కూడా వేశా అని ఆయన అన్నారు. అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని, అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని…
గత శుక్రవారం సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండలంలో 5 వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక పై జరిగిన అత్యాచార ఘటనపై హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో సిద్ధిపేట జిల్లా పోలీస్ కమిషనర్ అనురాధతో ఫోన్ లో మాట్లాడి నిందితుడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. బాధిత బాలికకు పునరావాస ఏర్పాట్లు చేయాల్సిందిగా, అలాగే బాలికకు కస్తూరిబా గాంధీ పాఠశాలలో చదువుకునేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయన సూచించారు. ఘటనపై పారదర్శకంగా…
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో సంచలనం సృష్టించిన “మూటలో మహిళా శవం” హత్య కేసు వివరాలను షాద్ నగర్ ఏసీపీ ఎన్.సిహెచ్ రంగస్వామి మీడియాకు వెల్లడించారు. గత నెల 27వ తేదీ రాత్రి అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్న ఒంటరి మహిళ కన్నా భాగ్యలక్ష్మి అలియాస్ లక్ష్మి (40) హత్యకు గురైంది. ఆమె శవాన్ని ఓ బ్లాంకెట్ లో చుట్టి ప్లాస్టిక్ కవర్లో వేసి ఫరూక్ నగర్ శ్రీనివాస కాలనీలో ఓ డ్రైనేజ్ పక్కన మూటగట్టి…
రీసర్వేలో గ్రామకంఠంగా పట్టా భూమి.. మంత్రి లోకేష్‌కి ఫిర్యాదు కూటమి ప్రభుత్వం ఏర్పడినాటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ కొనసాగిస్తున్నారు.. తాను ప్రతినిథ్యం వహిస్తోన్న మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు.. ఇక, 38వ రోజు “ప్రజాదర్బార్” కు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే బారులు తీరారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి…