Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన కుమారస్వామి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ఖండించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని ఆరోపిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలకు స్పందిస్తూ, కుమారస్వామి గురువారం ఎక్స్ ద్వారా వెల్లడించిన తన స్పందనలో, ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తోందనే ఆరోపణలు నిరాధారమని, సత్యదూరమని స్పష్టం చేశారు.
Rashid Khan: ఘనంగా పెళ్లిచేసుకున్న స్టార్ అల్ రౌండర్.. హాజరైన క్రికెటర్లు!
Also Read
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
అతను తెలిపిన వివరాల ప్రకారం, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిన 48 గంటల్లోనే తిరిగి వారిని నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 27న తొలగించిన 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికులను 29వ తేదీన మళ్లీ విధుల్లోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ స్వప్రయోజనాలు , ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ అంశాన్ని వాడుకోవడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
ఇక కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి గురించి మాట్లాడతే, ఇప్పటివరకు రద్దు చేసిన 3,700 మంది కాంట్రాక్ట్ లేబర్ పాసులను త్వరలో ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా పునరుద్ధరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం స్పష్టం చేసింది. అంతేకాక, కార్మికుల బయోమెట్రిక్ డేటాను త్వరలో పునరిద్ధరించనున్నామని కుమారస్వామి తెలిపారు.
Tirumala: నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు… తిరుమలలో ట్యాక్సీలకు అనుమతి నిరాకరణ
గేట్ పాస్ వ్యవస్థతో పాటు, అవసరమైన సౌకర్యాలను కొనసాగించేందుకు అన్ని పక్షాలీ చర్చల సమయంలో అంగీకరించాయని ఆయన చెప్పారు. మొత్తం మీద, ఎన్డీఏ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తోందనే ఆరోపణలు అసత్యం అని, ప్రభుత్వ రంగ సంస్థలను సమర్ధంగా నిర్వహించడం ద్వారా గత మూడేళ్లలో వాటి షేర్ విలువ అద్భుతంగా పెరిగిందని మంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. ఇది కాకుండా, బాధిత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?