గ్రూప్ 1 అభ్యర్థులపై లాఠీ ఛార్జీ చేయడం దారుణమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులపై లాఠీచార్జి ని ఖండిస్తున్నామని, ప్రభుత్వం గ్రూప్ 1 విషయంలో తప్పు చేసిందన్నారు. ప్రభుత్వం అనాలోచితంగా జీవో29ని తెచ్చారని, ఇది చిల్లర చర్య…. ఈ జీవో ఎవరి ఆలోచన అని, గ్రూప్స్ పరీక్షను వాయిదా వేయాలి… జీవో-29 పై చర్చ చేయండన్నారు. షాపుల్లో ఉన్నవారిని కూడా లాక్కొచ్చి మరీ కొడుతున్నారు… ఇదేం పద్ధతి, ప్రభుత్వం అబద్దాలు…
దేశంలో 5జీ నెట్వర్క్ దూసుకుపోతోంది. క్రమ క్రమంగా ఈ నెట్వర్క్ గ్రామాలకు సైతం విస్తరించింది. టెలికాం నెట్‌వర్క్‌లో దూసుకుపోతున్న రిలయన్స్ జియో.. 5జీ సేవలు మరిన్ని మారుమూల గ్రామాలకు చేరవేచే పనిలో ఉంది.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం ఈవో డి.పెద్దిరాజును బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెద్దిరాజును తన మాతృ సంస్థకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
మంత్రి లోకేష్‌కు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఓ విజ్ఞప్తి చేశారు. రాయలసీమలో మహిళలకు ప్రత్యేక ఇంజనీరింగ్ కళాశాల కోసం విద్యా మంత్రి లోకేష్‌ను మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం తెలుగు వారి కోసం అంతర్జాతీయంగా అనేక సాంకేతిక అవకాశాలను అందిపుచ్చుకుని అద్భుతాలు సాధించిందన్నారు.
డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒక పండు. ఈ పండును అనేక పేర్లతో పిలుస్తారు. అందమైన రంగుల కలయికతో కనిపించే ఈ పండు మధ్య అమెరికాలో ఎక్కువగా లభిస్తుంది. అయితే.. ప్రస్తుతం ఈ పండు చాలా చోట్ల దొరుకుతుంది. గత కొన్నేళ్లుగా ఈ పండ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ పండును కట్ చేస్తే లోపల గుజ్జు ఉంటుంది. అందులో చిన్న గింజలు ఉంటాయి. ఇది తింటే.. పుల్లగా, తియ్యగా రుచిగా ఉంటుంది. ఈ పండులో ఉండే గుణాల…
ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ పరిధిలో నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి మీడియా సమావేశం లో ఏర్పాటుచేసి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల లో తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్రతో అనుసంధానంగా ఉన్న లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద భారీ ఎత్తున గంజాయి పట్టుబడిన సందర్భంలో ఈ నిందితులు ఆ కేసులో మిగిలినవారుగా ఉండడం, అదేవిధంగా ఆ గంజాయి తరలించే…
ఏపీ ప్రభుత్వం ఇసుక విషయంలో గుడ్‌న్యూస్ చెప్పింది.ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను ట్రాక్టర్లల్లో తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో స్థానిక అవసరాలకు ఇసుకను తీసుకెళ్లేందుకు కేవలం ఎడ్ల బండ్లకు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియన్ మార్కెట్లో గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 31 వరకు అన్ని టయోటా డీలర్‌షిప్‌లలో అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్ డీలర్-ఫిట్టెడ్ టయోటా జెన్యూన్ యాక్సెసరీస్ (TGA) ప్యాకేజీతో వస్తుంది. ధర రూ. 6.86-10 లక్షలు (ఎక్స్ షోరూం ఢిల్లీ).
మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు పోలీస్ కస్టడీ విధిస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మహిళ హత్య కేసులో రిమాండ్ ఖైదీ నందిగం సురేష్ ను పోలీస్ కస్టడీకి ఇస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 9 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో.. కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించి ఈ ఘనత సాధించాడు. 42 ఓవర్లో విలియం ఒరోర్కే బౌలింగ్ లో సింగిల్ పూర్తి చేసి ఈ ఘనతను అందుకున్నాడు.