కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047 అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది పర్చాలనే లక్ష్యంతో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల సాధన దిశగా 20 సూత్రాల కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు ఛైర్మన్ లంకా దినకర్ తెలిపారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు.
హైదరాబాద్ కలెక్టరేట్లో గోషామహల్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజా సింగ్, గణేష్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. 144 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. మేడ్చల్ జిల్లాలోని రాంపల్లిలో ఉన్న డబుల్ బెడ్ రూమ్స్ కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దీపావళి పండగ కొత్త ఇంట్లో జరుపుకునేలా పండగకు…
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో యుముంబా, దబాంగ్ ఢిల్లీ తలపడ్డాయి. ఈ పోరులో దబాంగ్ ఢిల్లీ విజయం సాధించింది. 36-28 పాయింట్ల తేడాతో గెలుపొందింది. దీంతో.. సీజన్ రెండో మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ విజయం సాధించింది.
గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జీకి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కె.లక్ష్మణ్ తెలిపారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతకు ఇది నిదర్శనమన్నారు. రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమైన జీవో 29ను రద్దు చేయాలన్నారు. ఈ జీవో 29 తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ ప్రకారం కాకుండా 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్ క్లియర్ చేసిన అభ్యర్థులను మెయిన్స్ కు అర్హత కల్పించిందని ఆయన వ్యాఖ్యానించారు.…
ప్రో కబడ్డీ సీజన్ 11 ఈరోజు ప్రారంభమైంది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రో కబడ్డీ పోటీలు మొదలయ్యాయి. అయితే.. తొలి మ్యాచ్ బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ మధ్య పోరు జరిగింది. ఈ పోరులో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. 37-29 పాయింట్ల తేడాతో గెలుపొందింది. దీంతో.. మొదటి మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది.
ఈనెల 22,23 తేదీల్లో మంగళగిరి సీకే కన్వెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 విజయవంతానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈమేరకు డ్రోన్ సమ్మిట్ ఏర్పాట్లపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి వివిధ శాఖల కార్యదర్శులు,ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
చదువుకుంది ఇంజనీరింగ్. చేస్తున్న వృత్తి మోడల్ ఫోటోగ్రఫీ. తిరిగేది ఖరీదైన కార్లు, బైకుల్లో, వాడుతున్న సెల్ ఫోన్లు చూస్తే రూ. లక్షల ఐ ఫోన్లు . ఖరీదైన అద్దె నివాసముంటు, సమాజంలో బడా బాబుల్లా వ్యహారం. కాని మూడోకంటికి తెలియకుండా గుర్తు చప్పుడు కాకుండా గంజాయి వ్యాపారం చేస్తూ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ పోలీసులకు పట్టుబ డి ఉన్న పరువు కాస్తా.. బజార్లో పడేసి.. కటకటాల పాలైన యువకుల చీకటి బాగోతం. వివరాల్లోకి వెళితే.. కూకట్పల్లి వసంతనగర్…
మియాపూర్ మెట్రోస్టేషన్ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత సంచరిస్తోందని తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గ్రూప్-1 మెయిన్ అభ్యర్థులకు షాక్.. పరీక్షలకు లైన్ క్లియర్..! తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులు, సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసి పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, డివిజన్ బెంచ్ ఆ పిటిషన్ను కొట్టివేసింది. ఈ మేరకు, కోర్టు అభ్యర్థులకు షాక్ ఇచ్చింది, ముఖ్యంగా ఈ నెల 21 నుంచి 27 వరకు జరగబోయే పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. అంతేకాక, కోర్టు చివరి నిమిషంలో పరీక్షలను రద్దు చేయడం సాధ్యం కాదని, 8 మంది పిటిషనర్ల…
రంజీ ట్రోఫీ-2024 ఎలైట్ గ్రూప్-డి పోటీల్లో తమిళనాడు బ్యాటర్ సాయి సుదర్శన్ చెలరేగాడు. ఈ రోజు తమిళనాడు-ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. గ్రూప్ డి రంజీ ట్రోఫీ మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తమిళనాడు ఒక వికెట్ నష్టానికి 379 పరుగులు చేసింది. తమిళనాడు బ్యాటర్లలో సాయి సుదర్శన్ అజేయ డబుల్ సెంచరీ సాధించాడు.