గ్రూప్-1 అభ్యర్థులు పరీక్ష తేదీలను మార్చాలని కోరుతూ నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నిరసనల్లో పాల్గొన్న గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం మరింత దుమారం రేగింది. అయితే.. దీనిపై తాజాగా కేటీఆర్ స్పందిస్తూ.. గ్రూప్ వన్ అభ్యర్థులను కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం దుర్మార్గమన్నారు. గ్రూప్ వన్ అభ్యర్థులను పశువుల్లా చూస్తుంది ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. గ్రూప్ వన్ అభ్యర్థులు ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాతలు అని,…
వానాకాలం రైతు భరోసా ను ఎగగొట్టటం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయటమే అని బీఆర్ఎస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసా వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాం రాం చెబుతున్నారన్న కేసీఆర్ మాటలను రేవంత్ రెడ్డి సర్కార్ అక్షరాల నిజం చేసిందన్నారు. వానాకాలం పంట సీజన్ కు రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టేసిందని, లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టిందన్నారు కేటీఆర్. రేపు,…
రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందనడానికి విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్(ట్విట్టర్) వేదికగా వ్యాఖ్యానించారు. 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర వీడడం లేదని విమర్శించారు.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును రైల్వే అధికారులను, రహదారులు భవనాల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతతో పనులు కొనసాగించాలని అధికారులకు సూచించారు.
సరైన జీర్ణక్రియను నిర్వహించడం శరీరానికి చాలా ముఖ్యం. జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటే మన శరీరంలోని ఇతర అవయవాలు కూడా సక్రమంగా పనిచేస్తాయి. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలలో అతి ముఖ్యమైన సమస్యలు.. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, అపానవాయువు, మలబద్ధకం. ఈ సమస్యలు చాలా మంది ప్రజలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రభావితం అవుతారు. ఈ జీర్ణ సమస్యలే కాకుండా మీ ఆరోగ్యాన్ని పాడుచేసే మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అవును.. తిన్న వెంటనే మలం విడుదల…
రాజధాని పనుల పున:ప్రారంభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. అమరావతి రైజెస్ ఎగైన్ అంటూ ముఖ్యమంత్రి ట్వీట్లో పేర్కొన్నారు. అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభంపై రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
నిరుద్యోగులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. తాను అశోక్ నగర్ వచ్చి గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు బండిసంజయ్. పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంస్థలతో కలిసి.. గ్రూప్-1 అభ్యర్థులతో పాటు వారికి మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. గ్రూప్1 అభ్యర్థులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు బండి సంజయ్. అనంతరం గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి సచివాలయానికి ర్యాలీగా బయలుదేరారు.…
విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా ప్రస్తుతం కంట్రోల్లో ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 13న తొలి డయేరియా కేసు నమోదైందని తెలిపారు. గుర్లలో ఎనిమిది మంది మృతి చెందినా.. ఇప్పటి వరకు డయేరియాతో మృతి చెందిన వారు ఒక్కరేనన్నారు.
దాల్చిన చెక్కతో స్థూలకాయాన్ని, ముఖ్యంగా పొట్ట కొవ్వును త్వరగా తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్క దాదాపు ప్రతి భారతీయ ఇంటిలో కనిపించే సుగంధ ద్రవ్యం. దీనిలో చాలా లక్షణాలు ఉన్నాయి. ఇది బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఈ మసాలా ఆహార కోరికలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.
మద్యం, ఇసుకలో దోపిడీ అంటూ జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శలు గుప్పించారు. పారదర్శకంగా జరిగిన మద్యం విధానంపై విమర్శలు సిగ్గు చేటన్నారు. ఎక్సైజ్ విభాగాన్ని నిర్వీర్యం చేసి మద్యాన్ని దోచుకోవడం నిజం కాదా అంటూ ప్రశ్నించారు. సెబ్ పేరుతో అక్రమ మద్యం వ్యాపారానికి అడ్డులేకుండా చేసుకోవడం నిజం కాదా అంటూ ప్రశ్నలు గుప్పించారు.