Kishan Reddy : మూసీ సుందరీకరణపై రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు
- మూసీ ప్రక్షాళణపై రేవంత్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు
- మూసీ పరీవాహక ప్రాంతంలో కష్టపడి పేదలు ఇళ్లు కట్టుకున్నారు
- 30 ఏళ్ల కిందట నిర్మించుకున్న ఇళ్లకు ప్రభుత్వం ట్యాక్సులు కూడా వసూలు చేస్తోంది
- పేదల గూడు కూలగొట్టి సుందరీకరణ చేస్తామనడం సరికాదు.? పేదల ఇళ్లు కూల్చే ఆలోచన సీఎం రేవంత్ ఉపసంహరించుకోవాలి : కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్వాన్ డివిజన్, కేసరి నగర్ హనుమాన్ టెంపుల్ ప్రాంతంలోని మూసీ పరిధిలో పర్యటించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణపై రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, మూసీ పరివాహక ప్రాంతంలో అనేక మంది పేద ప్రజలు ఒక్కో ఇటుక పేర్చి, కష్టపడి ఇండ్లు కట్టుకున్నారు. అందుకు ఇక్కడి ప్రజలే సాక్ష్యమన్నారు. 30 ఏండ్ల కిందటే ఇక్కడ నిర్మించుకున్న ఇండ్లకు కరెంట్ కనెక్షన్లతో పాటు నీటి సదుపాయం, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ప్రభుత్వం ట్యాక్సులు కూడా వసూలు చేస్తోందని, గత 30 ఏండ్ల కింద నిర్మించుకున్న పేదల ఇండ్లను కూల్చాలనుకోవడం ఏమాత్రం న్యాయం కాదు. దీనిపై సీఎం రేవంత్ మానవతాదృక్పథంతో వ్యవహరించాలన్నారు కిషన్ రెడ్డి. పేద ప్రజల ఇండ్లు కూల్చడం ఏమాత్రం న్యాయం కాదని, అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమైనా పేద ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం పనిచేయాలన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు ఒక్క ఇల్లు కట్టించలేదని, రెక్కాడితే గాని డొక్కాడనటువంటి వేలాది మంది ప్రజలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 ఫీచర్లు లీక్.. ఎలా ఉన్నాయంటే..?
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
అంతేకాకుండా..’నిజాం హయాంలో మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి మూసీ బ్యూటిఫికేషన్ చేయాలి. అంతకంటే.. ముందు డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరించేలా కార్యాచరణను రూపొందించాలి. ఆ తర్వాత మూసీ సుందరీకరణ చేయాలి. పేదల గూడు కూలగొట్టి, సుందరీకరణ చేస్తామనడం ఎవరికోసం..? పేదల ఇండ్లు కూల్చే ఆలోచనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపసంహరించుకోవాలి. ప్రజల ఇండ్లు కూల్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని, రూ. 25 వేలు ఇస్తామంటూ చెబుతున్నాడు. దీనిని ప్రజలెవ్వరూ స్వాగతించట్లేదు. పేదల ఇండ్ల కూల్చాలనుకునే ముందు మమ్మల్ని జైలులో పెట్టి ఆ తర్వాత మీ కార్యాచరణ మొదలుపెట్టండి. ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలందరికీ బిజెపి అండగా ఉంటుంది. ధైర్యంగా ఉండాలని కోరుతున్నా. మూసీ సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చుతూ చేస్తున్న విధ్వంసకాండకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 25వ తేదీన బిజెపి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తాం. రండి.. కదలిరండి.. రాష్ట్ర ప్రభుత్వ దుశ్చర్యకు వ్యతిరేకంగా పోరాటానికి దిగుదాం.’ అని కిషన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?