ఈ నెల 23న జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం 26వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ఈ నెల 26న సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని తెలిపారు.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు సోమవారం నుంచి జరుగుతున్నాయని.. ఈ పరీక్షల కోసం ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాలయాపనకు ఫుల్స్టాప్ పెట్టాలని ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామన్నారు. గ్రూప్ 1 పరీక్షలు కచ్చితంగా నిర్వహిస్తామన్నారు. కొంతమంది ఉద్యోగాలు పోవడంతో వాళ్లు ఆందోళన చేస్తున్నారని సీఎం వెల్లడించారు.
ప్రభుత్వం మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టిన గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేసిన మరుసటి రోజు, శనివారం కూడా ఆశావహులు తమ నిరసనను కొనసాగించి అశోక్ నగర్లో భారీ నిరసన చేపట్టారు. క్రాస్ రోడ్డు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఔత్సాహికులతో అనేక కోచింగ్ సెంటర్లు , నివాస ప్రాంగణాలను కలిగి ఉన్న అశోక్ నగర్ ప్రాంతంలో తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఔత్సాహికులతో వాపు ప్రారంభమైంది. సూడెంట్స్ ర్యాలీలు చేపట్టే…
ఈ నెల 22-23 వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్-2024కు ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రెండు రోజుల సదస్సు సరిగే మంగళగిరి సీకే కన్వెన్షన్‌లోనూ, ఇటు 22వ తేదీ సాయంత్రం విజయవాడ కృష్ణానది తీరాన ఉన్న పున్నమీ ఘాట్ వద్ద మెగా డ్రోన్ షో నిర్వహణకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.
అధిక కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి చాలా హానికరం. దాని ప్రభావం గుండె ఆరోగ్యంపై కనిపిస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి గుండె జబ్బులు, గుండెపోటు వంటి తీవ్రమైన ప్రాణాంతక సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో.. కొలెస్ట్రాల్ ఎప్పటికప్పుడూ చెక్ చేసుకుని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలి.
సింగపూర్ లో..దుబాయ్ లో ఏముండే.. ఇసుక తిన్నెలు తప్పా.. ఇంకేం ఉన్నాయని, ఇప్పుడు ఎలా మారిపోయాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రోడ్లు వెడల్పులో జూబ్లీహిల్స్.. బంజారాహిల్స్ లో పెద్ద పెద్ద ఇండ్లు కూల్చారని, మూసీలో లక్ష 50 వేల కోట్లు పెట్టినట్టు మాట్లాడుతున్నారని, .కేసీఆర్..కేటీఆర్..హరీష్ లు గొప్ప నీతిమంతుల లెక్క మాట్లాడుతున్నారన్నారు మంత్రి జూపల్లి. వీళ్ళ ఎంత గొప్పవాళ్ళు అంటే.. హరీష్.. ఒకప్పుడు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లావో తెలియదా..? అని ఆయన అన్నారు.…
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో తాగు నీటి సమస్య పరిష్కారం దిశగా అడుగులుపడ్డాయి. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇటీవల కంకిపాడులో జరిగిన ‘పల్లె పండుగ’ ప్రారంభ కార్యక్రమంలో తన నియోజకవర్గంలోని మూడు మండలాల్లోని 43 గ్రామాల్లో తాగునీటి కలుషిత సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తెచ్చారు.
కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై పెట్లోల్ దాడి ఘటన కలకలం రేపింది. ఇంటర్ విద్యార్థినిని రోడ్డు పక్కనే చెట్లలోకి తీసుకెళ్లి ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని స్థానికులు కడప రిమ్స్‌కు తరలించారు.
రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన రుణమాఫీ అమలులో విఫలం అయ్యారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని నిలదీసే కర్తవ్యాలు మాకు ఉంటాయన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చటం లో ఎందుకు జాప్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సూటి ప్రశ్న అడుగుతున్నామన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయింది.. రేవంత్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. కొత్త పెన్షల మాట దేవుడు…
అందుకే నల్ల షర్టు వేసుకున్నా.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు హరీష్ రావు, కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరూ కలిసి మా జిల్లాకు నష్టం చేకూరే పనులు చేస్తున్నారు.. అందుకే నల్ల షర్టు వేసుకున్నానని మంత్రి కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరైడ్ కు శాశ్వత పరిష్కారం ఎస్ఎల్బీసీ అన్నారు. ఎస్ఎల్బీసీ, మూసీ శుద్దికరణ విషయంలో ముఖ్యమంత్రిని అభినందుస్తున్నా అన్నారు. ఒక వైపు ఫ్లోరైడ్, మరోవైపు కోటిన్నర…