ఏలూరులోని విద్యానగర్లో దారుణం జరిగింది. వివాహితపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్తో దాడి చేశారు. రాత్రి స్కూటీపై వెళుతుండగా దుండగులు యాసిడ్ చల్లడంతో ఆమె తీవ్ర గాయాలతో ఆస్పతిలో చికిత్స పొందుతుంది. మెరుగైన వైద్యం కోసం ఆమెను విజయవాడ తరలించారు.
రైతు కుటుంబం నుంచి వచ్చిన ఓ వరుడు.. తమ ప్రధానవృత్తి వ్యవసాయం అందుకు తగ్గట్టుగా తన వివాహ ఊరేగింపు ఉండాలనుకున్నాడు. అందుకు ఒకటి రెండు కాదు ఏకంగా 51 ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్లాడు. ఇందులో ఓ ట్రాక్టర్ని వరుడే స్వయంగా నడపగా..మిగతావి బంధవులు స్నేహితులు నడిపారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బుధవారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. రేపు అర్ధరాత్రి 12 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్నారు. అయితే అయిత్ షా పర్యటనలో భాగంగా దర్శక ధీరుడు రాజమౌళి నివాసానికి వెళ్లనున్నారు.
హైదరాబాద్ బోయినపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పు గోదావరికి చెందిన విజయలక్ష్మీ భర్త, తన ఇద్దరు కూతుళ్లతో బోయినపల్లిలో నివసిస్తోంది. ఇటీవలే ఇంటి పెద్ద, తమ తండ్రి చనిపోయాడు. అయితే తన తండ్రి లేడన్న బాధతో అప్పటి నుంచి ఫ్యామిలీ మొత్తం డిప్రెషన్లోకి వెళ్లిపోయారు.
కేసీఆర్ అనాలోచిత విధానంతో రాష్ట్రం అప్పుల ఉబిలోకి పోయిదంటూ.. సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. రూ.4వేల కోట్లతో నీళ్లు అందించే అవకాశం ఉండగా.. మిషన్ భగీరథతో రూ.40 వేల కోట్ల అప్పులు చేశారని దుయ్యబట్టారు.
మనం ఏదైనా పని చేయాలంటే మూడ్ బాగుండాలి. అంతేకాకుండా ఆ పని చేసేందుకు మానసికంగా సిద్ధమైనప్పుడే పని చేయగలుగుతాం. కొన్నిసార్లు మనతో ఉన్న వ్యక్తులు.. మనల్ని కించపరిచేలా.. తిట్టినా ఇట్టే మనకు కోపమొచ్చి ఆ పని మీద ఇంట్రస్ట్ అనేది తగ్గిపోతుంది. మన మానసిక స్థితికి , మానసిక ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంది.
సిద్దిపేట జిల్లాలో అప్పుడే పుట్టిన శిశు విక్రయం కలకలం రేపుతుంది. సిద్దిపేట అర్బన్ (మం) బూర్గుపల్లి గ్రామ శివారులో నిన్న ఉదయం పుట్టిన పసికందును 20 వేలకు విక్రయించే ప్రయత్నం చేసారు తల్లిదండ్రులు. గజ్వేల్ కి చెందిన ఓ కుటుంబంతో విక్రయ ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం తెలుస్తోంది. విషయం తెలుసుకున్న బాల రక్షక్ అధికారులు శిశు విక్రయాన్ని అడ్డుకున్నారు.