జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి తలసాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డ్ కార్యాలయాల వ్యవస్థ అనేది దేశంలోనే గొప్ప నిర్ణయమని కొనియాడారు. హైదరాబాద్ లో జనాభా పెరుగుతోందని, ప్రజలకు పౌరసేవలు పెరగాలనే ఉద్దేశ్యంతో వార్డ్ కార్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు మంత్రి తలసాని. పరిశుభ్రత కోసం జీహెచ్‌ఎంసీ అనేక చర్యలు తీసుకుందని, హైదరాబాద్ వాసులకు సిటిజన్ చార్టర్ ను తీసుకొచ్చామన్నారు. 132 వార్డ్ కార్యాలయాలు ప్రారంభించుకున్నామని ఆయన అన్నారు. మిగితా 8 వార్డ్ కార్యాలయాల్లో కొన్ని పనులు మిగిలి ఉన్నాయని, త్వరలో అవి కూడా ప్రారంభించుకుంటామని మంత్రి తలసాని వెల్లడించారు.
Also Read : WhatsApp Features: వాట్సప్ లో అదిరిపోయే 5 సీకెట్ర్ ఫీచర్స్.. అవేంటో తెలుసుకుందాం..!
వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. అంతేకాకుండా ఆయా శాఖల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని చెప్పారు. వార్డు స్థాయిలో కార్పొరేటర్లు ఉన్నా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా లేకపోవడం వల్ల ఈ వార్డు కార్యాలయ వ్యవస్థను తీసుకువచ్చామని తెలిపారు. దేశంలో ఉన్న ప్రధాన నగరాల కంటే హైదరాబాద్ ఎక్కువ అభివృద్ది జరుగుతుందని, నిధుల విషయం పై వెనకాడకుండా సీఎం కేసిఆర్, కేటీఆర్ హైదరాబాద్ అభివృద్ధి చేయాలనే ఆలోచన తో ఉన్నారన్నారు. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని కావాలనే అంశంపై తర్వాత స్పందిస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్.
Also Read : WhatsApp Features: వాట్సప్ లో అదిరిపోయే 5 సీకెట్ర్ ఫీచర్స్.. అవేంటో తెలుసుకుందాం..!