ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలకు రూ.25కోట్లు చొప్పున, జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున సీఎం ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో వందకు వంద శాతం బీఆర్ఎస్ గెలుస్తుందని.. దాంట్లో అనుమానమే లేదన్నారు సీఎం కేసీఆర్.
తెలంగాణపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో రాజకీయాల పైన ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటున్నారు. ఆ నివేదికల ఆధారంగా మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ యాత్ర గురించి తాజాగా రాహుల్ గాంధీ ఆరా తీసారు. రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రేతో పాటుగా ముఖ్య నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. సుదీర్ఘంగా యాత్ర కొనసాగిస్తున్న భట్టి ప్రధానంగా పేద ప్రజలతో మమేకం కావటం.. వారి సమస్యల పైన…
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తల్లెంపాడులో భేటీ అయ్యారు. అయితే భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత రేవంత్ రెడ్డి భట్టి పాదయాత్రలో కలవడం ఇదే మొదటిసారి. జులై 2న జరగబోయే తెలంగాణ జన గర్జన సభ సన్నాహక సమావేశం గురించి చర్చించారు.
గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి టెంపుల్ సమీపంలో శేజల్ నిద్రమాత్రలు మింగి మూడోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమేను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీంతో ఆమే ప్రాణాల నుండి బయటపడింది. అయితే ఆమే ఎన్టీవీతో మాట్లాడుతూ.. ఎమ్యెల్యే దుర్గం చిన్నయ్య పై ఆరోపణలకు ఆధారాలు లేవు అంటున్నారని.. నాలుగు గోడల మధ్య జరిగిన దానికి ఆధారాలు ఉంటాయా అని శేజల్ అన్నారు. అలా కూడా తన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయని..…
టొమాటో తర్వాత ఇప్పుడు ఉల్లి కూడా కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది. గత 4 రోజుల్లో ఉల్లి ధర కూడా బంపర్ జంప్ నమోదైంది. కిలో రూ.15 పలికిన ఉల్లి ధర.. ఇప్పుడు రూ.20 నుంచి 25కి చేరింది. ఈ విధంగా గత 4 రోజుల్లో ఉల్లి ధర కూడా రూ.10 పెరిగింది. ఉల్లిపాయల హోల్‌సేల్ ధర గురించి మాట్లాడితే.. 25 శాతం పెరిగింది.
నేటి కాలంలో దాదాపు అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేశారు. ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలు రికార్డు సృష్టిస్తోంది. అక్టోబర్ 2021లో ప్రారంభించినప్పటి నుంచి మే నెలలో ఆధార్ ఆధారిత ముఖ-ప్రామాణీకరణ ద్వారా 1.06 కోట్ల లావాదేవీలు జరిగాయి.
కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ సంస్థకు షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్విట్టర్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
శివసేన (యూబీటీ)కి చెందిన సామ్నా తన తాజా సంపాదకీయంలో రుతుపవనాల సన్నద్ధత, ముంబయిలో వరదల నిర్వహణపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించింది. అవినీతి కారణంగా నగరం మునిగిపోయిందని పేర్కొంది.
ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం బయలుదేరారు. ఈ క్రమంలో ఢిల్లీ యూనివర్సిటీకి చేరుకునేందుకు మెట్రో రైలులో ప్రయాణించారు. భారీ భద్రత మధ్య మెట్రో రైలులో ప్రధాని మోడీ ఢిల్లీ యూనివర్సిటీకి బయలుదేరారు.