వందే భారత్ ఎక్స్ప్రెస్లో కొన్ని రైళ్ల ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ఇటీవల రైల్వేశాఖ ప్రకటించింది. దీంతో చాలా మంది ప్రయాణికులు లబ్ధి పొందుతారని రైల్వే భావిస్తుంది. అయితే ఛార్జీలు తక్కువగా ఉంటే ప్రతి ఒక్కరూ వందేభారత్ లో ప్రయాణించవచ్చని తెలుపుతుంది. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో వందేభారత్ రైలును నడపడం వల్ల రైల్వేకు పెద్దగా ప్రయోజనం లేదని తెలుస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేశాఖ నిజంగా ప్రజల ప్రయోజనాల కోసం వందేభారత్ ఛార్జీలను తగ్గిస్తున్నదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు…
కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా త్రివిద దళాల్లో అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ పథకం కింద త్రివిధ దళాల్లో ఎంపికైన వాళ్లని అగ్నివీర్లుగా పిలుస్తున్నారు. అయితే ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి ఓపీ సోనీని విజిలెన్స్ బ్యూరో అరెస్ట్ చేసింది. 2016 నుంచి 2022 వరకు అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాల నేపథ్యంలో ఆయనను అధికారులు అరెస్ట్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో మధుమేహం వేగంగా పెరుగుతోంది. వృద్ధులతో పాటు యువతలో కూడా ఈ వ్యాధికి సంబంధించిన కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మధుమేహం నుంచి కొద్దికొద్దీగా బయటపడాలంటే.. మీ జీవనశైలిని మార్చుకోవాలి. అంతేకాకుండా ఆ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఛత్తీస్గఢ్లో 2018లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోవడానికి ముందు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ.. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టోను రూపొందించేందుకు 31 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ను ఏర్పాటు చేసింది.
తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య వివాదం ముదిరింది. గవర్నర్ ఆర్ఎన్ రవి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. గవర్నర్ ఆర్ఎన్ రవిపై ఫిర్యాదు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ రాశారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల పాలన ప్రారంభం నాటి నుంచి నుంచి బాలికలు, మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆఫ్ఘనిస్థాన్లో పాఠశాలలు మూసివేయడంతో బాలికలు ఇప్పుడు కుట్టు కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నారు.
రైలు కింద పడిన తర్వాత మనిషి కానీ జంతువు కానీ బ్రతకడం చాలా కష్టం. అలాంటిది ఓ కుక్క రైలు కింద పడ్డ బతికి బట్ట కట్టింది. అంతం దగ్గరలో ఉన్నవాడిని విశ్వంలో ఏ శక్తీ రక్షించదు. అలాగని.. మరణం వ్రాయబడని వ్యక్తిని చంపగల శక్తి కూడ లేదు. కొన్నిసార్లు అదృష్టం కొద్దీ ఏదైనా ప్రమాదం నుంచి బయటపడుతారు. ఇప్పుడు కూడా ఈ కుక్క లక్కీగా ప్రాణాల నుంచి బయటపడింది.
పిల్లలను కనవా.. అని పదే పదే ఓ కుటుంబం ఓ వ్యక్తిని ప్రశ్నించింది. దీంతో విసుగుచెందిన ఓ వ్యక్తి ఆ కుటుంబంలోని ముగ్గురిని సుత్తితో కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన పంజాబ్లోని లూథియానాలోని సేలం తబ్రీ ప్రాంతంలో జరిగింది.
రసాయనిక ఎరువులు వాడితే ఎక్కువ దిగుబడులు వస్తాయని చాలా మంది రైతులు భావిస్తున్నా ఆ పరిస్థితి లేదు. రైతు సోదరులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తేనే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. ఇందుకోసం ఆవు పేడ, వర్మీకంపోస్టును ఎరువుగా ఉపయోగించాలి. ఇప్పుడిప్పుడే రైతాంగం సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తోంది. సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేసే పండ్లు మరియు కూరగాయల ధర కూడా చాలా ఎక్కువ. అంతేకాకుండా ప్రభుత్వం కూడా సేంద్రియ వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహిస్తోంది.