నోట్ల మార్పిడి వ్యవహారంలో కొందరిని బెదిరించి డబ్బులు గుంజిన కేసులో ఏఆర్ సీఐ స్వర్ణలత అరెస్టు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రూ.2వేల నోట్ల మార్పిడి కేసులో విశ్రాంత నేవీ అధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో పోలీసులు కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. రూ.90 లక్షలు విలువ చేసే రూ.500 నోట్లను ఇస్తే రూ.కోటి విలువ చేసే రూ.రెండు వేల నోట్లను ఇచ్చేందుకు విశ్రాంత నేవీ అధికారులతో గ్యాంగ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. నేవీ అధికారులు తెచ్చింది 90 లక్షలు కాదు…రూ.12 లక్షలేనంటు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
Also Read : Dil Raju :జవాన్ సినిమా తెలుగు హక్కుల కోసం ప్రయత్నిస్తున్న దిల్ రాజు..?
నోట్ల మార్పిడి పేరుతో విశ్రాంత నేవీ అధికారులను బెదిరించింది రిజర్వు ఇన్‌స్పెక్టర్ బి.స్వర్ణలత గ్యాంగ్. దోపిడికీ పాల్పడిన కేసులో పోలీసులు కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. తెచ్చిన 12 లక్షల్లో ఆర్‌ఐ స్వర్ణలత, సూరిబాబులకురూ.ఐదేసి లక్షలు, హోంగార్డు శ్రీనివాసరావుకు రూ.రెండు లక్షలు పంచుకున్నట్లు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. కేసు తీవ్రతను తగ్గించి ఇన్‌స్పెక్టర్‌ను బయటపడేసేందుకేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు 90 లక్షలు ఎవరివి ఎక్కడవి అనే దానిపై స్పష్టత రాలేదని, రిమాండ్ రిపోర్ట్ లో సైతం 90 లక్షల గురించి ప్రస్తావన రాకపోవడం గమనార్హం. రూ..12 లక్షలతో కేసు ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : Gandeevadhari Arjuna Pre-Teaser: పవర్ ఫుల్ యాక్షన్ తో అదరగొట్టిన మెగా ప్రిన్స్