పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదించేందుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఈరోజు సమావేశం కానుంది. దళితులకు భూపంపిణీ అనేది ఎజెండాలోని కీలకాంశాల్లో ఒకటి. TOEFL (ఇంగ్లీష్‌ని విదేశీ భాషగా పరీక్ష) శిక్షణకు సంబంధించిన ఒప్పందాలను మంత్రివర్గం సమీక్షించి, ఆమోదం తెలుపుతుంది. నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంకా బేతంచర్ల, గుంతకల్లు, మైదుకూరులో పాలిటెక్నిక్ కాలేజీల ప్రతిపాదనను కూడా పరిశీలించి ఆమోదం తెలపనున్నారు. అదేవిధంగా మంగళవారం నాటి ఏస్‌ఐపీబీ సమావేశం నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
Also Read : Extramarital Affair: దారుణం.. ఆపనికి అడ్డుగా ఉందని కూతుర్ని హత్య చేసిన తల్లి
మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేసే వీలుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించించిన వివరాలను ప్రచారం చేయటం, ప్రతిపక్షాలకు సంబందించిన విమర్శలను తిప్పికొట్టే అంశాల పై ఇప్పటికే కేబినెట్ మంత్రులకు క్లియర్ గాచెప్పారు. ఇక జిల్లాల వారీగా ముఖ్యమంత్రి పర్యటనలు, మంత్రుల సమావేశాలు, పార్టి నియోజకవర్గాల ఇంచార్జ్ లు, పర్యవేక్షుల పాత్ర పై కూడ చర్చిస్తారని చెబుతున్నారు. మంత్రి వర్గ సమావేశంలో ఇటీవల పోలవరం కు సంబంధించిన అంశాల పై చర్చకు వచ్చే అవకాశం ఉంది. డయాఫ్రం వాల్ నిర్మాణం పై మెదలయిన వివాదం కారణంగా అటు కేంద్రం పోలవరం అంశాన్ని టేకప్ చేసింది. ఈ అంశం పై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర స్దాయిలో అధికారుల సమావేశం జరిగింది.
Also Read : IND vs WI: జట్టు నుంచి ఎందుకు తప్పించారో అర్ధం కావడం లేదు: హనుమ విహారి