కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ సారథ్యంలో పాకిస్థాన్ జట్టు విదేశీగడ్డపై ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ గెలిచింది. ఆస్ట్రేలియన్ గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన పాకిస్థాన్ రెండో కెప్టెన్‌గా రిజ్వాన్ నిలిచాడు. సిరీస్ గెలిచిన తర్వాత మహ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ.. తాను టాస్, మ్యాచ్ ప్రెజెంటేషన్‌కు మాత్రమే కెప్టెన్ అని అన్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT)కి ముందు ఆస్ట్రేలియాకు గట్టిదెబ్బ తగిలింది. పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియాను తన సొంతగడ్డపై ఓడించింది. మూడో వన్డేలో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా గంట్యాడ మండలం ఎగువ కొండపర్తిలో గల వైకుంటగిరి అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి వస్తుండగా బొలెరో వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ (నవంబర్ 10) సెయింట్ జార్జ్ పార్క్, గ్క్వెబర్హాలో జరగనుంది. కాగా.. తొలి టీ20 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభం కాగా, రెండో టీ20 టైమింగ్‌లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. రెండో టీ20 ఒక గంట ముందుగానే ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఉన్న లోక కళ్యాణార్ధమై శ్రీ క్రోధినామ సంవత్సర భవానీ దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 11 నుండి డిసెంబరు 25 వరకు భవానీ దీక్షలు ప్రారంభం కానున్నాయి.
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్- పుణేరి పల్టాన్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠపోరులో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 34-33 పాయింట్ల తేడాతో టైటాన్స్ గెలుపొందింది.
కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. అబద్దాలంటేనే కాంగ్రెస్ పార్టీ.. మోసాలు, అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. మహారాష్ట్రకు పోయి అబద్దాలు చెప్పడం కాదా..? తెలంగాణలో తిరిగి ఆ విషయాలు చెప్పే దమ్ముందా..? కాంగ్రెస్ పార్టీ నిజంగా 6 గ్యారంటీలను అమలు చేసి ఉంటే.. కోట్లు ఖర్చు పెట్టి మహారాష్ట్రలో ఇచ్చిన యాడ్స్‌లో ఆ విషయం ఎందుకు ప్రస్తావించలేదు..? అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలంతా సహకరించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్వేపై వివిధ శాఖల అధికారులతో చర్చించడం జరిగిందని.. ఈ సర్వే పూర్తిగా ప్రభుత్వపరంగా చేపడుతున్నదని.. సర్వే ఆధారంగా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయబడతాయని అన్నారు.
వైయస్ జగన్, ఆయన కుటుంబ సభ్యుల మీద చేస్తున్న పోస్టులను డీజీపీకి ఇచ్చామని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. చట్టప్రకారం చర్యలు తీసుకోమని కోరామని తెలిపారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు దారుణంగా కొట్టారని.. సుధారాణి అనే యువతిపై చిలకలూరిపేట సీఐ తీవ్రంగా దాడి చేసి కొట్టారని ఆయన పేర్కొన్నారు.
యాదాద్రి జిల్లా రామన్నపేటలో నూతనంగా నిర్మించిన సహకార సంఘం భవనాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. రైతు రుణమాఫీపై క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 9 లోపు పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 22 లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేశాం.. రాష్టంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలోనే ఎక్కువ రుణమాఫీ జరిగిందని అన్నారు.