యాదాద్రి జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. పోచంపల్లి మండలం గౌస్ కొండ, రేవనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి.. కొనుగోలు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు కిషన్ రెడ్డికి తమ సమస్యలు చెప్పుకున్నారు. కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుంది.. హమాలీల కొరత ఉంది.. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించడం లేదు.. బస్తాలు, తర్పలిన్, సూతిల్ కూడా లేవని కిషన్ రెడ్డికి రైతులు చెప్పారు.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని సీఎం చంద్రబాబు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, తదితరులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు.
ఈ నెల 14 నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు నిర్వహించనుంది. గత పది నెలల్లో ఊహకందని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో సర్కార్ ముందుకు దూసుకెళ్తుంది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి అవుతున్నందున.. ఈ నెల 14 వ తేదీ నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నారు.
సౌతాఫ్రికా-భారత్ మధ్య జరుగుతున్న తొలి టీ20లో భారత్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 202 పరుగులు సాధించింది. సౌతాఫ్రికా ముందు 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచారు.
రాష్ట్ర ప్రభుత్వానికి రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది ఒక ప్రధాన డాటా వనరుగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సచివాలయంలో శుక్రవారం రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ)పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్లో జరుగుతున్న డాటా ఇంటిగ్రేషన్ పనులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ.. 6 హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసుల అక్రమ నిర్బంధాలపై బాధిత కుటుంబ సభ్యులు పిటిషన్లు వేశారు. ఈ క్రమంలో న్యాయస్థానం విచారణ చేపట్టింది. అక్రమంగా నిర్బంధించిన ఆరుగురు ఎక్కడున్నారో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు ఆదేశించింది. లోకేష్ అనే సోషల్ మీడియా ప్రతినిధి హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణలో ఎస్సై జానకి రామయ్య కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో.. ఎస్సై జానకి రామయ్య స్టేట్మెంట్ను…
సౌతాఫ్రికా-భారత్ జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈరోజు మళ్లీ 2024 టీ20 ప్రపంచకప్ ఫైనలిస్టులు తలపడనున్నారు. ఇరు జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు జరుగనుంది. అందులో భాగంగా.. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ చేయనుంది. డర్బన్ వేదికగా రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఏలూరు పోలీసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. గత త్రైమాసికంలో దొంగలు ఓ బైకును దొంగలించారు. నీలి అలివేణి అనే మహిళ తన తలసేమియా బాధిత కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఉపయోగించిన బైక్ ను ఎత్తుకెళ్లారు. అయితే.. బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని తిరిగి అప్పగిస్తున్నప్పుడు ఆమె భావోద్వేగాలు కదిలించాయని చంద్రబాబు తెలిపారు.
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ సరిహద్దులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భారీ భద్రత నడుమ కడప పీఎస్‌కు తరలించినట్లు సమాచారం.
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న వ్యవసాయ, పశుసంవర్దక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ర్టంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఐదు కోట్ల మందికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. గత ఐదేళ్లు ఎవరిని వదలలేదు.. కేసులు పెట్టారు.. ఆస్తుల ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందారని వైసీపీపై మండిపడ్డారు.