విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఉన్న లోక కళ్యాణార్ధమై శ్రీ క్రోధినామ సంవత్సర భవానీ దీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుండి డిసెంబరు 25 వరకు భవానీ దీక్షలు కొనసాగనున్నాయి.
నేటి నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనునుంది. ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది. 11 గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. శాసనమండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం రెండో రోజు ఘనంగా ముగిసింది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కోటి దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ పరమశివుడి సేవలో పాల్గొన్నారు.
తిరుపతికి చెందిన దొంగ నోట్లు తయారీ ముఠాను పుత్తూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. డీఎస్పీ రవికుమార్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. తెలంగాణ నుంచి వచ్చిన డీ రోనాల్డ్ రోస్‌ను ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమించారు. కె.కన్నబాబుకు మున్సిపల్, పట్నాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. మొదటగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తక్కువ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.
విశాఖ రైల్వే జోన్‌కు స్థలం కేటాయించారు.. త్వరలోనే పనులు షురూ.. విశాఖ రైల్వే జోన్ స్థలం కేటాయించారని, త్వరలోనే జోన్ పనులు ప్రారంభం చేస్తామని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ సమావేశంలో కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడారు. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైను ఇప్పటివరకు సత్తుపల్లి వరకు పూర్తి అయ్యింది మిగతాది అతి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. బీపీసీల్ కంపెనీ 70 కోట్ల రూపాయల ప్రాజెక్టును వేరే రాష్ట్రంలో పెట్టాలనుకున్న…
నెల్లూరులో రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతికి కొత్త విధానాన్ని తీసుకువస్తున్నామని వెల్లడించారు. లైసెన్స్డ్ సర్వేయర్ లేదా ఇంజనీర్లు ప్లాన్ సమర్పిస్తే చాలు అని పేర్కొన్నారు.
కొత్త సెడాన్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే అదిరిపోయే శుభవార్త ఉంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్.. సెడాన్ ఆరాపై ఈ (నవంబర్) నెలలో బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. నవంబర్ 2024లో హ్యుందాయ్ ఆరాను కొనుగోలు చేసే వినియోగదారులు రూ. 43,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
కంటిచూపు సమస్య రావడానికి కారణం.. కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం. అంతే కాకుండా.. చెడు ఆహారపు అలవాట్ల వల్ల కూడా కళ్లపై ప్రభావం పడుతుంది. దీంతో.. క్రమంగా చూడడంలో ఇబ్బంది ఎదుర్కోవలసి వస్తుంది.