రేపటి నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రేపు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రేపు ఉదయం 9 గంటలకు బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనునుంది. ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ జరుగనుంది. గ్వెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7.30 గం.కు ప్రారంభం కానుంది. అందులో భాగంగా.. టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
పోలీస్ బాస్‌లు పొలిటికల్ బాస్‌ల కోసం, పనిచేస్తున్నారని మాజీ మంత్రి విడదల రజనీ విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలని మాటలకే పరిమితమయ్యాయన్నారు. ఆ లోపాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు.
వెస్టిండీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సాల్ట్ 54 బంతుల్లో 6 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సెంచరీ తర్వాత.. ఫిల్ సాల్ట్ టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఫిల్ సాల్ట్ వెస్టిండీస్‌తో జరిగిన టీ20 అంతర్జాతీయ క్రికెట్లో మూడో సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు.
దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ లిజెల్ లీ ఆదివారం మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL) 2024లో అరంగేట్రం చేసింది. హోబర్ట్ హరికేన్స్ వర్సెస్ పెర్త్ స్కార్చర్స్ మ్యాచ్‌లో అజేయంగా 150 పరుగులు చేసి అద్భుత రికార్డు సృష్టించింది. హోబర్ట్ హరికేన్స్ తరుఫున ఆడుతున్న లీజెల్.. సిడ్నీ క్రికెట్ స్టేడియంలో 75 బంతుల్లో 12 ఫోర్లు, 12 సిక్సర్లతో ఊచకోత చూపించింది. డబ్ల్యూబీబీఎల్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఇన్నింగ్స్.
Union Minister Srinivas Varma: విశాఖ రైల్వే జోన్ స్థలం కేటాయించారని, త్వరలోనే జోన్ పనులు ప్రారంభం చేస్తామని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ సమావేశంలో కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడారు. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైను ఇప్పటివరకు సత్తుపల్లి వరకు పూర్తి అయ్యింది మిగతాది అతి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. బీపీసీల్ కంపెనీ 70 కోట్ల రూపాయల ప్రాజెక్టును వేరే రాష్ట్రంలో పెట్టాలనుకున్న దానిని మన రాష్ట్రానికి తీసుకురావడానికి…
కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైట్లో అబద్ధాలు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైట్లో అబద్ధాలు పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తామని మాట తప్పారుని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తన అబద్ధాల ప్రవాహాన్ని మహారాష్ట్ర లో కొనసాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీ లు ఇచ్చి అమలు చేయకుండా తెలంగాణ లో…
నామినేటెడ్ పదవులు పొందిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం నాయకులు పనిచేయాలని వారికి సూచించారు. పోరాటం, కష్టం, త్యాగం, పనితీరు, విధేయత, క్రమశిక్షణ ఆధారంగా పదవులు ఇచ్చామని వెల్లడించారు.
ఏపీ రాజధాని అమరావతి నగరం సుస్థిరాభివృద్ది, నగర నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు లు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా రూ.15 వేల కోట్ల రూపాయల మేర రుణ సహకారాన్ని అందించనున్నట్టు స్పష్టం చేసింది.
పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికి తెలిసిందే.. ఎందుకంటే పండ్లలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఒక్కో పండులో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా మనం యాపిల్, అరటి, మామిడి, జామ వంటి పండ్లను మాత్రమే ఎక్కువగా తింటుంటా. ఈ పండ్లతో పాటు మరో ప్రత్యేకమైన పండు కూడా ఉంది. ఇది తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.