Audimulapu Suresh: టంగుటూరి ప్రకాశం పంతులు పోరాట పటిమ ఎంతో గొప్పది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్మారకోపన్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. భారతదేశ స్వాతంత్ర్య సమరంలో తెలుగువారి పాత్ర గణనీయమైనదని పేర్కొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు పోరాట పటిమ ఎంతో గొప్పదని కొనియాడారు. అంతేకాకుండా.. ప్రకాశం పంతులు బారిష్టర్ చదివిన అడ్వకేట్ అని.. ప్రజాప్రతినిధిగా, ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి సేవలు మరువలేనివి అని గుర్తు చేశారు.
Read Also: Kavya Kalyanram: అల్లు అర్జున్ ముసలివాడు అయిపోతాడు.. హీరోయిన్ గా చేయను..
Also Read
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
- Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
మరోవైపు రాజకీయాలు కెరీర్ గా ఎంచుకోవాలంటే చాలా సాహసం కావాలని మంత్రి ఆదిమూలపు అన్నారు. ఈ రోజుల్లో రాజకీయాలలోకి వెళ్ళాలా అని ఒక కుర్రాడు తన తల్లిని అడిగితే చెంప ఛళ్ళుమనిపిస్తుందని తెలిపారు. మరోవైపు ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి యూనివర్సిటీ అని నామకరణం చేశామని.. గతంలో ఒక జీఓ ఇచ్చి అసలు యూనివర్సిటీనే లేకుండా చేసారని మంత్రి విమర్శించారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ తెచ్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని ఆయన కొనియాడారు.
Read Also: Bigg Boss Telugu Season 7 : అదరిపోయే ఎంటర్టైన్మెంట్ కి ముహూర్తం ఫిక్స్ అయిందిగా..
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. రాజకీయం ఒక వ్యసనమే అని అన్నారు. టంగుటూరి ఏ ప్రతిఫలం ఆశించకుండా రాజకీయానికి వెచ్చించారని తెలిపారు. పొలిటీషన్ అవాలనుకుంటే you should study your own interest to become a politician అని బెర్నార్డ్ షా అన్నాడని గుర్తు చేశారు. పేదరికాన్ని ప్రేమించాం కనుక రాజకీయంలో ఉన్నాం అని వావిలాల చెప్పారన్నారు. టంగుటూరి ప్రకాశం పేదరికంలో పుట్టి తన సంపాదన మొత్తం వదులుకున్నాడని.. 75వేల రూపాయల ఫీజు 1975లో టంగుటూరి భరణం కేసులో తీసుకున్నాడని ఉండవల్లి తెలిపారు. దేవుడే ప్రకాశం పంతులుగా పుట్టాడు అని ఒక పెద్దాయన చెప్పారని.. పొలిటీషియన్ తన గురించి తాను ఆలోచించనంత కాలం ప్రజలు అతని గురించి ఆలోచిస్తారని ఉండవల్లి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!