ఏపీలో పలు చోట్ల నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ రోజు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ వెల్లడించింది. breaking news, latest news, telugu news, big news, rain alert
చంద్రయాన్-3 ల్యాండింగ్ పురస్కరించుకుని రేపు స్కూళ్లను సా.6.30 వరకు నడపాలన్న నిర్ణయాన్ని విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. స్కూళ్ల టైమింగ్స్ పొడిగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. విద్యార్థులు ఇళ్లలోనే లైవ్ చూడాలని కోరింది. breaking news, latest news, telugu news, big news, chandrayaan 3,
చంద్రయాన్-3పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు చంద్రుడిపై చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్ దిగనునుంది. ఈ రోజు సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై ల్యాండింగ్ కానుంది. జాబిల్లి దక్షిణధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్నారు. breaking news, latest news, telugu news, big news, chandrayaan 3, big news, Moon
ఉత్తరప్రదేశ్ లోని పరస్పూర్లోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 89 మంది బాలికలు అదృశ్యమయ్యారు. మొత్తం అక్కడ 100 మంది బాలికలు ఉండగా.. 11 మంది విద్యార్థినులు మాత్రమే ఉన్నారు.
ఘజియాబాద్‌లో ఓ స్కూల్ బస్సు మంటల్లో కాలిపోయింది. ఆ బస్సు ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్దిగా గుర్తించారు. అయితే మంటలు చెలరేగిన సమయంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యార్థులను దించిన కొద్ది నిమిషాలకే బస్సులో మంటలు చెలరేగాయి.
ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు జనాలు అతలాకుతలం అవుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటికే కొండచరియలు విరిగిపడి చాలా మంది వరకు చనిపోయారు. మరోవైపు అధిక వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో విపత్తు లాంటి పరిస్థితి నెలకొందని, ఇప్పటివరకు రాష్ట్రానికి రూ. 1,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం చెప్పారు.
క్రికెట్ లెజెండ్, భారతరత్న సచిన్ టెండూల్కర్ తో ఎన్నికల సంఘం ఒప్పందం కుదుర్చుకోనున్నది. ఎన్నికలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సచిన్‌ను నేషనల్ ఐకాన్‌గా ఈసీ నియమించనున్నది.
రాబోయే G20 సమ్మిట్ కోసం సెప్టెంబర్ 8-10 వరకు పబ్లిక్ హాలిడే ప్రకటించాలని ఢిల్లీ పోలీసులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సిఫార్సు చేస్తూ ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ ఢిల్లీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు.