ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నగరిలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమం కింద ఆర్థిక సహాయాన్ని విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి రూ.680.44 కోట్లు కేటాయించింది, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.32 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చింది. breaking news, latest news, telugu news, jagananna deevena, cm jagan, latest news,
తమకు నూకలు చెల్లడం కాదు.. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయని మంత్రి హరీష్ రావు కౌంటరిచ్చారు.
శివసేన (యూబీటి) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)ను అమీబాతో పోల్చారు. బీజేపీ నేతృత్వంలోని ఫ్రంట్‌కు ఖచ్చితమైన ఆకారం, పరిమాణం లేదని అన్నారు.
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత కనిపించగా.. సాయత్రం నుంచి వాతావరణంలో మార్పు కనిపించింది. దీంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లింగంపల్లి, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, బేగంపేట్, తార్నాక, ఉప్పల్, హిమాయత్ నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది.
సిద్దిపేటలో మెగా డ్రోన్ షో నిర్వహించారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ షోను ఏర్పాటు చేశారు. కోమటి చెరువు వేదికగా 450 డ్రోన్ లతో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగాగా హాజరై.. షోను తిలకించారు.
పశ్చిమ బెంగాల్‌లోని దుత్తాపుకూర్‌లో ఆదివారం ఉదయం బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ సుకాంత మజుందార్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ప్రభుత్వం ప్రీమియం బాస్మతీ బియ్యం ముసుగులో తెలుపు బాస్మతీయేతర బియ్యం 'అక్రమ' ఎగుమతిని ఆపడానికి కేంద్రం కట్టడి చర్యలు ప్రారంభించింది.