రూ.50 కోసం పుర్రెలు పగిలేటట్లు కొట్టుకున్నారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణలో కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవలో దాదాపు 10 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన ఘజియాబాద్‌లోని ఖిందౌడా గ్రామంలో జరిగింది.
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఆరేళ్ల ఆడ ఏనుగు నోటిలో నాటుబాంబు పేలి మృతి చెందిన ఘటన కంటతడి పెట్టిస్తోంది. పండు అనుకుని ఆ ఏనుగు నాటుబాంబును కొరికింది. ఏనుగు కొరికిన వెంటనే ఆ బాంబు నోటిలోనే పేలింది.
గూగుల్.. ప్రస్తుతం ప్రతీ ఒక్కరికి కనీస అవసరంలాగా మారిపోయింది. సెర్చ్ ఇంజన్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు గూగుల్. అంతలా ఎదిగిపోయింది మరీ ఆ సంస్థ. ఏ విషయం అడిగినా ప్రతి ఒక్కరు గూగుల్ సెర్చ్ చేయడం సాధారణమైపోయింది. అంతటి దిగ్గజ సంస్థ పుట్టి నేటికి 25 ఏళ్లు అయింది. ఈ క్రమంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తమ ఉద్యోగులను ఉద్దేశించి ఓ బ్లాగ్ రాశారు.
ప్రధాని మోడీ బుధవారం ఇండోనేషియా పర్యటనకు వెళ్లారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగే ఆసియాన్-భారత్ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహ్వానం మేరకు జకార్తా వెళ్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు.
తెలంగాణ సర్కారు దివ్యాంగులకు పెన్షన్ ఇస్తున్నదన్న ఒకే కారణంతో వారికి రావాల్సిన రాయితీలు , ఇతర అవకాశాలను గాలికి వదిలేసిందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు , రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. కేంద్ర సర్కారు నరేంద్ర మోడీ నేత్రత్వంలో దివ్యాంగుల చట్టం 2016 తేవడంలో వారి వైకల్యాల సంఖ్య 7.. breaking news, latest news, telugu news, big news, mp k laxman
యూపీలోని వారణాసిలో ఓ కారు అగ్నికి ఆహుతైంది. కదులుతున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ గమనించి కారులో నుంచి దూకి అతని ప్రాణాలను కాపాడుకున్నాడు.
సాధారణంగా చైనా ప్రొడక్ట్స్ గురించి ఇతర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటాయి. అదే తరహాలో చైనాకు కూడా భద్రతాపరమైన భయం పట్టుకుంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆఫీసు పనులకు యాపిల్ ఐఫోన్లు సహా ఇతర ఏ విదేశీ బ్రాండ్ ఫోన్లూ వాడొద్దని చైనా తమ ఉద్యోగులకు సూచించినట్లు తెలుస్తోంది.